Tobacco: సిగరెట్ ప్యాకెట్లపై మారనున్న హెల్త్ వార్నింగ్.. ఇక మరింత కఠిన హెచ్చరికతో..
Tobacco: సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరిక త్వరలోనే మారనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1, 2022 నుంచి సిగరెట్ ప్యాకెట్లపై ఉండే ఫొటోలను మార్చనుంది. ఈ విషయాన్ని...
Tobacco: సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరిక త్వరలోనే మారనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1, 2022 నుంచి సిగరెట్ ప్యాకెట్లపై ఉండే ఫొటోలను మార్చనుంది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ముద్రించే ఈ ఫొటోలకు కేవలం ఏడాది గడువు మాత్రమే ఉంటుంది. డిసెంబర్ 1, 2022 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ కొత్త చిత్రాలతో కూడిన సిగరెట్ ప్యాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఏడాది తర్వాత మళ్లీ మారుస్తారు.
ధూమపానం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అధికారులు ఈసారి మరింత కఠినమైన హెచ్చరికను ప్రింట్ చేయనున్నారు. సిగరెట్ ప్యాక్‌పై ‘పొగాకు సేవించే వారు త్వరగా మరణిస్తారు’ అని ప్రింట్ చేయనున్నారు. అంతేకాకుండా.. ‘పొగాకు బాధకరమైన మరణాన్ని ఇస్తుంది’ అనే మెసేజ్‌ను ప్రింట్ చేయనున్నారు. టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్ 2008 ప్రకారం అధికారులు ఈ కొత్త సవరణ చేశారు.
సిగరెట్లను తయారు చేసే వారు, అమ్మే వారు, సప్లై చేసే వారు కొత్త సిగరెట్ ప్యాకెట్లపై కొత్తగా చేసిన మార్పులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..