AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025: కండలు తిరిగిన బాబా ఒకరు.. తలపై పావురంతో మరొకరు..

మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది భక్తులు తరలివస్తున్నారు. విదేశీ పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. భారత విదేశాంగ శాఖ సూచన మేరకు కొంత మంది విదేశీ ప్రతినిధులు మహా కుంభమేళాకు వచ్చారు.

Mahakumbh 2025: కండలు తిరిగిన బాబా ఒకరు.. తలపై పావురంతో మరొకరు..
Maha Khumbhamela
Phani CH
|

Updated on: Jan 21, 2025 | 7:08 PM

Share

అక్కడి పూజలు, ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలకు కేంద్రంగా మారిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం..మరి కొన్ని ఆసక్తికర దృశ్యాలకూ వేదిక అవుతోంది. మునుపెన్నడూ చూడని విధంగా రకరకాల నాగ సాధువులు, బాబాలు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ కుంభమేళా సమయంలో తప్ప మరెప్పుడూ వీళ్లు కనిపించరు. అసలు ఎక్కడ ఉంటారు..? ఎలా జీవనం కొనసాగిస్తారన్నదీ మిస్టరీయే. కానీ..కుంభమేళా వచ్చిందంటే చాలు..ఎక్కడెక్కడి నుంచో వీళ్లంతా గుంపులుగా వచ్చేస్తారు. పుణ్యస్నానం ఆచరించి..అందరినీ ఆశీర్వదించి మళ్లీ తమ స్థానాలకు వెళ్లిపోతారు. ఈ మహా కుంభమేళాలో ఎంతో మంది బాబాలు ఇలానే వచ్చి తమ భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ బాబాలలో ముందుగా చెప్పుకోవాల్సింది అంబాసిడర్ బాబా గురించే. 1972 నాటి మోడల్ అంబాసిడర్ కార్‌ని ఇంకా వాడుతున్నారు. అంతే కాదు. ఎన్నో ఏళ్లుగా కుంభమేళాకు ఈ కార్‌లోనే వస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఆయన తిండి, నిద్ర అంతా ఈ కార్‌లోనే. దాదాపు 35 ఏళ్లుగా ఇదే కార్‌లో ప్రయాణం చేస్తున్నట్టు చెబుతున్నారీ అంబాసిడర్ బాబా. ఐఐటీ ముంబయిలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన యువకుడు. ఈపాటికి మంచి కంపెనీలో జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఉంటాడనే అనుకుంటాం. కానీ…ఆ వ్యక్తి అలా చేయలేదు. ఈ డబ్బు, హోదా..ప్రతిదీ మాయే అని నమ్మాడు. అందుకే..బాబాగా మారాడు. ఇదిగో ఈయనే…ఆ బాబా. ఐఐటీ బాబాగా పేరు తెచ్చుకుని..కెనడాలో పని చేసినప్పుడు నెలకు 3 లక్షలు సంపాదించేవాడీ యువకుడు. కానీ..ఆ సంపాదనలో ఏ ఆనందమూ లేదని..ఆధ్యాత్మిక బాట పట్టాడు. వీళ్లతోపాటు రుద్రాక్ష బాబా, ఎన్విరాన్‌మెంటల్ బాబాలూ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇక ఈ మహా కుంభమేళాకు వచ్చిన వారిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో బాబా పేరు..ఖబూతర్ వాలే బాబా. తన తలపై ఓ పావురం ఎప్పుడూ అలా కూర్చుని ఉంటుంది. పైగా..ఈ పావురానికి హరి పురి అనే పేరు కూడా పెట్టుకున్నారు ఈ బాబా. దాదాపు 9 ఏళ్లుగా ఇది తనతోనే ఉంటోందట. ఈ పావురం ద్వారా..ప్రేమ, శాంతి సందేశాలిస్తున్నానని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే బాబా చాలా స్పెషల్. స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పోవెల్ జాబ్స్ ఈ మధ్యే మహా కుంభమేళాకు వచ్చారు. ఇది చాలా హైలైట్ అయింది. ఆమె రావడమే కాదు. ప్రత్యేకంగా ఓ బాబాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనే..స్వామి కైలాసానంద్ గిరి. పైగా…ఈ స్వామిని..ఆమె గురువుగా భావిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..నిరంజని అఖాడాకి చీఫ్. 1976లో జన్మించిన కైలాసానంద్ గిరి..చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక బాటలోకి వచ్చారు. ప్రస్తుతం హరిద్వార్‌లోని కాళీ ఆలయానికి చీఫ్‌గా ఉన్నారు. శ్రావణ మాసంలో..దాదాపు 24 గంటల పాటు కదలకుండా తపస్సు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు స్వామి కైలాసానంద్ గిరి. ఈయనే…లారెన్ పోవెల్ జాబ్స్‌కి..కమల అనే పేరు పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లీజ్.. పిల్లల్ని కనండి.. బుజ్జగిస్తున్న నేతలు.. కారణమేంటి ??

Virat Kohli: రూ.34 కోట్లతో కోహ్లీ కొత్త ఇల్లు.. హాలిడే హోమ్ కోసం ఇంత ఖర్చా ??

ట్రంప్ పలుకే “బంగారం” పెరిగినా..తగ్గినా.. అంతా ఆయన చేతుల్లోనే

Sunita Williams: సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చూశారా ??

నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు