ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

పురుషులు, మహిళలతో పాటు తమకు సమాన అవకాశాలు కల్పించాలని ట్రాన్స్‌జెండర్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్..

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 8:31 PM

పురుషులు, మహిళలతో పాటు తమకూ సమాన అవకాశాలు కల్పించాలని ట్రాన్స్‌జెండర్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లకు వారి కల నెరవేరింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం నియమించే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో ట్రాన్స్‌జెండర్ అనే ఆప్షన్‌ను పొందుపరచనుంది.

గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు ఈ చట్టం ఆధారంగా ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వం నియమించే అన్ని గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల్లో టాన్స్‌జెండర్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్-2020 ప్రకారం అప్లికేషన్ ఫామ్‌లో ట్రాన్స్ జెండర్ అనే థర్డ్ జెండర్ అనే అదర్ కేటగిరీ ప్రత్యేక ఆప్షన్‌ను చేర్చాలని పేర్కొంది. అలాగే లింగమార్పిడి చేసుకున్నవారికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నియమావళిని రూపొందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు భారత ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలూ, విభాగాలకూ స్పష్టం చేసింది.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

చరిత్రలో మొదటిసారిగా మైనస్‌లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ఫేస్‌బుక్‌ నుంచి మరో సరికొత్త యాప్.. ఫ్రీ గేమింగ్!