ఇండియా.. కరోనా జోరు.. 24 గంటల్లో 945 కొత్త కేసులు
ఇండియాలో 18, 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 603 మంది కరోనా రోగులు మృతి చెందారు. గత 24 గంటల్లో 945 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇండియాలో 18, 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 603 మంది కరోనా రోగులు మృతి చెందారు. గత 24 గంటల్లో 945 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 14,759 యాక్టివ్ కేసులు కాగా.. 3, 251 మంది రోగులు కోలుకున్నారు. వీరిలో 77 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4, 666, ఢిల్లీలో 2,0 81, గుజరాత్ లో 1939, మధ్యప్రదేశ్ లో 1485, తమిళనాడులో 1520 కేసులు నమోదయ్యాయి. అయితే రీకవరీ శాతం 17. 48 ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో 11 మంది పోలీసు అధికారులు, 38 మంది కానిస్టేబుల్స్, కరోనా బారిన పడ్డారు. ఒడిశాకు చెందిన వలస కూలీలు చెన్నైలో చిక్కుకుపోగా, లక్షా అరవై వేల రూపాయలు పెట్టి ఓ బోటును కొని సముద్ర మార్గం ద్వారా తమ స్వస్థలాలకు బయలుదేరారు.



