AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ‌ర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు కాలువ‌లో ఈత‌.. మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచిన తండ్రి

క‌రోనా ప్ర‌పంచంలో మొత్తాన్నీ క‌ష్టాల్లోకి నెట్టింది. లాక్ డౌన్ కార‌ణంగా అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో కొన్ని హృదయ విదారక ఘ‌ట‌నలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు క‌ల‌గానే మిగిలిపోయాయి. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో గంట ఈతకొట్టి త‌న ప్రాణ‌మైన‌ కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి..ఈదుతూనే ప్రాణాలు విడిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఈరోడ్​ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్​(60) అనే వ్య‌క్తి […]

గ‌ర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు కాలువ‌లో ఈత‌.. మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచిన తండ్రి
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 7:17 PM

Share

క‌రోనా ప్ర‌పంచంలో మొత్తాన్నీ క‌ష్టాల్లోకి నెట్టింది. లాక్ డౌన్ కార‌ణంగా అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో కొన్ని హృదయ విదారక ఘ‌ట‌నలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు క‌ల‌గానే మిగిలిపోయాయి. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో గంట ఈతకొట్టి త‌న ప్రాణ‌మైన‌ కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి..ఈదుతూనే ప్రాణాలు విడిచాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఈరోడ్​ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్​(60) అనే వ్య‌క్తి త‌న‌ కుమార్తె సుమతిని… హనూర్​ మండలం పుదుర్​ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. కాన్పు సమయం కావడం వల్ల సుమతిని శనివారం మెట్టూరు హాస్పిట‌ల్ లో చేర్చారు. తొలి కాన్పు కావ‌డంతో కరోనా లాక్​డౌన్​ ఉన్నా పెరుమాళ్​ ఎలాగైనా కూత‌రును చూడాలని నిశ్చయించుకొన్నాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువను ఈది ఆమె దగ్గరకు చేరుకోవాలని భావించాడు. తమిళనాడు-కర్ణాటక బోర్డ‌ర్స్ లో మైసూర్​-మెట్టూరు హైవేకి 200 మీటర్ల సమీపంలో ఉంటుందీ కాలువ. గంటసేపు ఈత కొడితే తమిళనాడులోని కరేకాడు చేరుకోవచ్చు. కొంత‌దూరం బాగానే వెళ్లిన పెరుమాళ్..మ‌ధ్య‌లో ఆయాసంతో ఈత కొట్టలేక కాలువలో మునిగి చనిపోయాడు. తమిళనాడులోని బరగూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అతడి​ డెడ్ బాడీ దొరికింది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు