AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్ లో ‘ఇంటిదొంగ’, హైదరాబాదీ సహా ఆరుగురిపై నేరారోపణ

అమెరికాలోని అమెజాన్ లో ఓ భారతీయుడు, ఇండియన్ అమెరికన్ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. యుఎస్ గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు...

అమెజాన్ లో 'ఇంటిదొంగ', హైదరాబాదీ సహా ఆరుగురిపై నేరారోపణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 19, 2020 | 10:32 AM

Share

అమెరికాలోని అమెజాన్ లో ఓ భారతీయుడు, ఇండియన్ అమెరికన్ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. యుఎస్ గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు వీరు అమెజాన్ సంస్థ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సుమారు లక్ష డాలర్లను ముడుపులుగా చెల్లించారని, కుట్రకు పాల్పడ్డారని  తెలుస్తోంది. 2017 నుంచి ఈ అక్రమార్కుల దందా కొనసాగుతోంది. వీరు  థర్డ్ పార్టీ మర్చంట్స్ ..అనధికారిక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా కాంపిటీటర్లకు, వినియోగదారులకు హాని కలిగే విధంగా తమ వస్తువులనే అమ్మడానికి ప్రయత్నించారని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. ఈ ఆరుగురిలో హైదరాబాద్ కు చెందిన 31 ఏళ్ళ నిషాద్ కుంజు, కాలిఫోర్నియాకు చెందిన 27 ఏళ్ళ రోహిత్ కడిమిశెట్టి, న్యూయార్క్ కు చెందిన ముగ్గురు, జార్జియాకు చెందిన ఒకరు ఉన్నారని తెలిసింది. వచ్ఛేనెల 15 న ఈ ఆరుగురిని సీటెల్ లోని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేటుగాళ్లు పది మంది అమెజాన్ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు లంచాలు చెల్లించి కుట్రకు పాల్పడినట్టు యుఎస్ అటార్నీ బ్రియాన్ మోరాన్ తెలిపారు. తమ నేరాన్ని వీరు అంగీకరించారని అయన చెప్పారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..