AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terrorist Attack: రివెంజ్‌ టైమ్‌ ఆగయా క్యా..? యాక్షన్‌ ప్లాన్‌ రెడీ..! ప్రధాని మోదీ కీలక భేటీ..

ఇట్స్‌ రివెంజ్‌ టైమ్‌. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా? ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చేశారు ప్రధాని మోదీ. మన వీర జవాన్లు పాక్‌కి ఎలా బుద్ధి చెప్పనున్నారు? ఈ నెల 9లోపు సైనిక చర్య షురూ కానుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.. వరుసగా అధికార వర్గాలతో మోదీ.. భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది..

Pahalgam Terrorist Attack: రివెంజ్‌ టైమ్‌ ఆగయా క్యా..? యాక్షన్‌ ప్లాన్‌ రెడీ..! ప్రధాని మోదీ కీలక భేటీ..
India Pakistan
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2025 | 7:32 AM

Share

వినిపిస్తోందా పాకిస్తాన్‌. ఇది మోదీ లేటెస్ట్‌ వార్నింగ్‌. ఆయన చెప్పారంటే చేస్తారంతే.. సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు సూటిగా మోదీ వార్నింగ్‌ ఇచ్చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందా? రివెంజ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయిందా? ఈ నెల 9న జరగనున్న రష్యా విక్టరీ పరేడ్‌కు మోదీ, రాజ్‌నాథ్‌ సహా భారత్‌ అగ్ర నేతలు ఎవ్వరూ వెళ్లడం లేదు. రష్యా టూర్‌ రద్దు చేసుకుని మరీ మోదీ అదే కసరత్తులో ఉన్నారా? భద్రత, యాక్షన్ ప్లాన్‌పై మోదీ, రాజ్‌నాథ్‌ నేరుగా సమీక్షించడాన్ని ఎలా చూడాలి. ఇక త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశాలు పూర్తయ్యాయి. దేశవిదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు పూర్తయ్యాయి.

ఈ నెల 9లోపు పాకిస్తాన్‌పై సైనిక చర్య షురూ కానుందా? అసలు సైనికచర్య అంటే ఏంటి? డైరెక్టుగా ఉగ్రవాదులను లేపేస్తే…అవి సర్జికల్‌ స్ట్రైక్స్‌. ఆ ఉగ్రవాదుల వెనుక ఉన్న పాక్‌కి బుద్ధి వచ్చేలా యుద్ధం ప్రకటిస్తే… అది సైనిక చర్య. దీనికోసమే ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక కలలో కూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులను శిక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే బిహార్‌లో మోదీ చెప్పారు.

నేవీ సన్నద్ధతపై చర్చ

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇండియన్‌ నేవీ చీఫ్‌ దినేష్‌ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకా దళ సన్నద్ధతపై చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీతో జమ్ముకశ్మీర్‌ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఆయనకు ఇది తొలి సమావేశం కావడం గమనార్హం.

ప్రతీకారం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుందా? తెలియాలంటే.. వేచి చూడాల్సిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..