AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి.. పాక్‌కు దిమ్మతిరిగిపోయిందిగా..

భారత్‌తో కాదు..ముందు నిత్యావసరాల రేట్లతో ఫైట్‌ చేయాలి పాకిస్తాన్‌. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు అంటూ పాకిస్తాన్ పౌరులు లబోదిబోమంటూ వాపోతున్నారు. ఆకలి రాజ్యంలో అల్లాడిపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న పాక్‌.. భారత్‌కు సవాళ్లు విసురుతూ నవ్వులపాలవుతోంది..

చికెన్‌ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి.. పాక్‌కు దిమ్మతిరిగిపోయిందిగా..
Pakistan Inflation Crisis
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2025 | 8:36 AM

Share

భారత్‌తో కాదు..ముందు నిత్యావసరాల రేట్లతో ఫైట్‌ చేయాలి పాకిస్తాన్‌. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు అంటూ పాక్‌ పౌరులు వాపోతున్నారు. ఆకలిరాజ్యంలో అల్లాడిపోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న పాక్‌.. భారత్‌కు సవాళ్లు విసురుతూ నవ్వులపాలవుతోంది.. డజను గుడ్లు రూ. 332, చికెన్‌ కిలో రూ. 798.89, కిలో బియ్యం రూ. 339.56, లీటర్‌ పాలు రూ. 224, టమాటా కిలో రూ. 150, ఆలూ కిలో రూ. 105, అర కిలో బ్రెడ్ రూ. 161.28 .. ఈ రేట్లు ఎక్కడో కాదు.. పక్క దేశం.. పాకిస్తాన్‌లోని నిత్యావసరాల ధరలు.. పాకిస్తానీ రూపాయల ప్రకారం ఉన్న ఈ ధరలు ఆ దేశానికి దడ పుట్టిస్తున్నాయి. ఆకలి రాజ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌లా మారింది మన పొరుగు దేశం. ఇక భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో…2 నెలలకు సరిపడేలా సరుకులు నిల్వ చేసి ఉంచుకోమని తమ పౌరులకు, మరీ ముఖ్యంగా పీవోకే వాసులకు చెబుతోంది పాకిస్తాన్‌. కానీ పాకిస్తాన్‌లో ఆ పరిస్థితి ఉందా? ఈ రేట్లు చూస్తే రెండు నెలల సరుకులు కాదు కదా.. రెండు రోజుల సరుకులు కూడా కొనుక్కుని పెట్టుకోగలిగేలా కనిపించడం లేదు.

పాక్‌ను భయపెడుతున్న భారత్‌ ఆర్మీ.. రేట్ల పోటుతో మరో తలనొప్పి

అటు భారత్‌ ఆర్మీతో పాటు ఇటు ధరల పెరుగుదల కూడా పాకిస్తాన్‌ను భయపెడుతోంది. తిండికే కటకటలాడుతున్న పాకిస్తానీలకు అసలు యుద్ధం చేసే సత్తా ఉందా అన్నదే ప్రశ్న. ఇండియన్‌ రూపీతో పోలిస్తే, పాక్‌ రూపీ చాలా బలహీనం. ఇక పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది.

ద్రవ్యోల్బణంతో పాక్‌ పరేషాన్.. అధ్వాన్నంగా ఆర్మీ పరిస్థితి

ఈ పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. ధరల పెరుగులతో ఆహార పదార్థాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు పాకిస్తానీలు. ఇక ఆర్మీ పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. వాహనాలకు, ట్యాంకులకు పెట్రోల్‌, డీజిల్ కొట్టించే పరిస్థితి కూడా లేదు. ఇక ఇండియాతో పాక్‌ వార్‌ మాటల వరకే పరిమితం అవుతోంది. చేతల దాకా వచ్చే సాహసం వాళ్లకు లేదని అర్థమైపోతోంది.

మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లున్నాయి పాకిస్తాన్‌ ప్రగల్భాలు. తిండికి కటకటలాడుతున్నా, రేట్ల పెరుగుదలతో పాక్‌ పౌరులు అర్ధాకలితో నకనకలాడుతున్నా.. ఇండియాకు సవాళ్లు విసరడంలో మాత్రం పాక్‌ తగ్గట్లేదు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..