G20 Summit: ‘వసుధైక కుటుంబం’ అనే గొప్ప సందేశాన్ని చాటిన యోగా దినోత్సవం..
ఈ ఏడాది భారత్ జీ20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నవ విషయం తెలిసిందే. వసుధైక కుటుంబం (విశ్వమంతా ఒకే కుటుంబం) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది భారత్. ఈ ట్యాగ్ లైన్ ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి ఏకతా సందేశాన్ని పంపుతోంది. అయితే ఇది కేవలం ట్యాగ్ లైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవంతో సహా వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశం 'ఒక కుటుంబం' సందేశాన్ని ఇచ్చింది...

ఈ ఏడాది భారత్ జీ20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నవ విషయం తెలిసిందే. వసుధైక కుటుంబం (విశ్వమంతా ఒకే కుటుంబం) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది భారత్. ఈ ట్యాగ్ లైన్ ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి ఏకతా సందేశాన్ని పంపుతోంది. అయితే ఇది కేవలం ట్యాగ్ లైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవంతో సహా వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశం ‘ఒక కుటుంబం’ సందేశాన్ని ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనున్న విషయం విధితమే. ఇందుకోసం జనవరి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని జి-20 దేశాల ప్రతినిధులతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విడివిడిగా సమావేశాలు జరుగుతున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సమావేశం ద్వారా ఐక్యతా సందేశాన్ని చాటుతోంది.
ఈ ఏడాది 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారతదేశం అధ్యక్షత వహించింది. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అధ్యక్షత వహించారు. 135 కంటే ఎక్కువ దేశాల నుంచి లక్షల్లో ప్రజలు ఈ ఈవెంట్‌లో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఏకతా సందేశాన్ని కూడా ఇచ్చారు. పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఇప్పటికే G20 దేశాల ప్రతినిధులతో పలు సమావేశాలు నిర్వహించింది.




ఆ సమావేశాలలో, దేశ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకురావడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు భారతదేశాని సొంతమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే జీ20 మూడో సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భాగస్వామ్యంపై చర్చ జరిగింది. అంతే కాకుండా పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారనే విషయాన్ని ‘ఉమెన్-20 సమ్మిట్’ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ‘గ్లోబల్ వార్మింగ్’ను అరికట్టాలంటే పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడంపై దృష్టి సారించడం చాలా అవసరమని, ఈ విషయంలో అన్ని దేశాలు సంయుక్తంగా ముందుకు రావాలని జీ-20 సమావేశంలో సూచించారు.
Embracing the spirit of Vasudhaiva Kutumbakam!
Looking back at how the 🌏 united as ‘One Family’ to celebrate the 9th #InternationalDayOfYoga & more from events under #G20India’s Presidency.
Read the latest edition of the #G20 Secretariat Newsletter ➡️ https://t.co/ek5jwOefL9 pic.twitter.com/PkdOaEzaMv
— G20 India (@g20org) July 11, 2023
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున చెట్లను నాటడం ద్వారా ప్రపంచాన్ని రక్షించాలనే సందేశాన్ని సమర్థిస్తున్నందున, G-20 సమావేశంలో నీటి సంరక్షణ థీమ్ కూడా ప్రముఖంగా ఉంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి హైదరాబాద్‌లో మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మిల్లెట్ ఆర్థిక సంవత్సరంగా మిల్లెట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ ఆహారం, ఆరోగ్య సేవల అంశాన్ని ప్రస్తావించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..