Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డను ఎత్తుకొని పరీక్ష కేంద్రానికి వచ్చిన తల్లి.. మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

గుజరాత్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ తన మంచితనాన్ని చాటుకున్నారు. పసిబిడ్డతో పరీక్షకు వచ్చిన ఓ అభ్యర్థికి తనవంతు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అంతేకాదు ఆ తల్లి పరీక్ష పూర్తయ్యేవరకు తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంది.

బిడ్డను ఎత్తుకొని పరీక్ష కేంద్రానికి వచ్చిన తల్లి.. మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్
Woman Constable
Follow us
Aravind B

|

Updated on: Jul 11, 2023 | 2:56 PM

గుజరాత్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ తన మంచితనాన్ని చాటుకున్నారు. పసిబిడ్డతో పరీక్షకు వచ్చిన ఓ అభ్యర్థికి తనవంతు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అంతేకాదు ఆ తల్లి పరీక్ష పూర్తయ్యేవరకు తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ హైకోర్టులోని ఫ్యూన్ పోస్టులకు ఆదివారం పరీక్ష జరిగింది. ఈ రాత పరీక్ష రాసేందుకు చాలామంది అక్కడికి వచ్చారు. అయితే ఈ పరీక్ష ఓ మహిళ తన ఆరు నెలల వయసున్న పసిబిడ్డను వెంటబెట్టుకుని వచ్చింది. కానీ పరీక్ష మొదలైన కొన్ని నిమిషాల ముందే ఆ బిడ్డ ఎడవడం మొదలుపెట్టింది. అయితే ఆ తల్లి ఒక్కసారిగా కంగారుపడింది. దీంతో అక్కడున్న ఓ మహిళా కానిస్టేబుల్ వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పుకుంది.

దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఆ పాపను ఎత్తుకుంది. ఆ తల్లి పరీక్ష రాసేంతవరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానని హామి ఇచ్చింది. అనంతరం ఆ తల్లిని పరీక్ష కేంద్రంలోకి పంపించింది. ఇక ఆ మహిళా కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తూనే ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంది. ఇందకు సంబంధించిన ఫోటోలను అహ్మదాబాద్ పోలీసులు తమ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. కానిస్టేబుల్ చూపిన మానవత్వంపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..