AC Railway Terminal: దేశంలో తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌.. ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న స్టేషన్‌..

Indias First Centralised AC Railway Terminal: ఎయిర్‌ పోర్ట్‌ను తలపించే రైల్వే స్టేషన్‌ను తాజాగా బెంగళూరులో నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా నామకరణం చేసిన ఈ రైల్వే టెర్మినల్‌ను..

AC Railway Terminal: దేశంలో తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌.. ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న స్టేషన్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2021 | 12:54 PM

Indias First Centralised AC Railway Terminal: ఎయిర్‌ పోర్ట్‌ను తలపించే రైల్వే స్టేషన్‌ను తాజాగా బెంగళూరులో నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా నామకరణం చేసిన ఈ రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ రైల్వే స్టేషన్‌ను ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. దేశంలోనే తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌గా ఇది ప్రఖ్యాతి గాంచింది. ఈ టెర్మినల్‌లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ టెర్మినల్‌లో 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 5 బస్సులను నిలిపే వీలుగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ నెల చివరినాటికి ఈ టర్మినల్ అందుబాటులోకి రానుంది. మరి ఈ అధునాత రైల్వే స్టేషన్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Greta Thunberg Tweets : మా శాంతియుత గళాలు మానవ హక్కుల ప్రతిబింబాలు, గ్రెటా థన్ బెర్గ్, దిశారవికి మద్దతు