‘గణేష్ చవితి రష్’, 162 ప్రత్యేక రైళ్లకు అనుమతి

ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ, మరోవైపు గణేశ చవితికి ప్రజల రద్దీని పురస్కరించుకుని 162 స్పెషల్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. వీటిలో..

'గణేష్ చవితి రష్', 162 ప్రత్యేక రైళ్లకు అనుమతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 2:20 PM

ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ, మరోవైపు గణేశ చవితికి ప్రజల రద్దీని పురస్కరించుకుని 162 స్పెషల్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. వీటిలో ఎక్కువ సర్వీసులను మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి నడుపుతారు. ఈ పండుగకు రష్ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల దీన్ని కాస్తయినా తగ్గించడానికి కొంకణ్ కు స్పెషల్ ట్రెయిన్స్ ని నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరడంతో రైల్వే శాఖ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రైళ్లలో ప్రయాణించేవారు 3 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, కోవిడ్ కి సంబంధించిన ఇతర గైడ్ లైన్స్ ని పాటించాలని రైల్వే శాఖ కోరుతోంది.

ప్రతి ఏటా లక్షలాది భక్తులు వినాయకచవితికి ముంబైతో బాటు ఇతర నగరాల నుంచి కొంకణ్ లోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. అహమ్మదాబాద్-వడోదర, మరికొన్ని ప్రాంతాలకు రైలు సర్వీసుల నిర్వహణకు వెస్టర్న్, సెంట్రల్  రైల్వే కో-ఆర్డినేషన్ తో ‘ గణపతి స్పెషల్’ రైళ్లను కూడా నడుపుతారట. ఈ నెల 22 న గణేశచవితి పండుగను జరుపుకోనున్నారు.