High Alert: ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన సర్కార్..
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోండి. ఇది తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులివి. కుండపోత వర్షాలు..

Very Heavy Rainfall: ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోండి. ఇది తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులివి. కుండపోత వర్షాలు ముంచుతుండడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఎక్కడ జలఖడ్గం విరుచుకుపడుతుందో తెలీడం లేదు. తమిళనాడులోని పలు జిల్లాలు ఇప్పటికీ పీకల్లోతు నీటిలో నానుతున్నాయి. మరిన్ని వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టంచేయడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలని.. వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. కోస్తా తీర ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాను ముంచెత్తుతున్నాయి వానలు. ద్రోణి ప్రభావంతో దంచి కొడుతున్నాయి. గత నాలుగురోజులుగా కురుస్తున్న వానలకు జిల్లా కకావికలమైపోతోంది. అయితే మళ్లీ అర్థరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది.
ఇవాళ, రేపు నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారులను కేటాయించారు కలెక్టర్ చక్రధర్ బాబు. అత్యవసరమైతే 1913 కాల్ సెంటర్‌కు కాల్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..
Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..
Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..
