సెకండ్ వేవ్ విలయానికి కేంద్ర ప్రభుత్వ ‘మనోవైకల్యమే ‘ కారణం….ఆర్థికవేత్త అమర్త్య సేన్
ఇండియాలో కోవిద్-19 వ్యాప్తి నివారణకు ప్రభుత్వం దృఢంగా కృషి చేసేబదులు తన చర్యలకు క్రెడిట్ సంపాదించేందుకు అనుసరిస్తున్న అయోమయ విధానాలు కారణమవుతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు.

ఇండియాలో కోవిద్-19 వ్యాప్తి నివారణకు ప్రభుత్వం దృఢంగా కృషి చేసేబదులు తన చర్యలకు క్రెడిట్ సంపాదించేందుకు అనుసరిస్తున్న అయోమయ విధానాలు కారణమవుతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఫలితంగా దేశం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇండియాలో ఫార్మా కంపెనీల సామర్థ్యం ఎంతో ఉందని, అలాగే ప్రజల్లో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువేనని ఆయన చెప్పారు. అసలు ఈ కోవిద్ పాండమిక్ పై పోరు జరిపే సత్తా ఇతర దేశాలకన్నా మన దేశానికి ఎక్కువే అన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. రాష్ట్ర సేవా దళ్ ఆధ్వర్యాన ముంబైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ సెకండ్ వేవ్ విలయానికి కేంద్ర ప్రభుత్వ ‘మనోవైకల్యమే’ కారణమని కూడా అభివర్ణించారు. ప్రభుత్వంలో అయోమయం నెలకొన్న ఫలితంగా ఈ సంక్షోభాన్ని సరిగా ఎదుర్కోలేకపోయిందని,తన శక్తిని ప్రదర్శించలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పాండమిక్ ని నివారించడానికి బదులు తన కృషికి క్రెడిట్ దక్కేలా చూపడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. బహుశా ఈ ప్రపంచాన్ని కాపాడగలనని ఇండియా భావించిందని, ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఈ పాండమిక్ ప్రజలపై పట్టు బిగించిందని అన్నారు. దేశంలో ఆర్ధిక వృద్ధి రేటు మందగించిందని, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని అమర్త్య సేన్ విచారం వ్యక్తం చేశారు. ఎకానమీ క్షీణత, సామాజిక బాధ్యతల వైఫల్యం ఈ పాండమిక్ తో బాటు దేశంపై దాడి వంటిది జరగడానికి దారి తీశాయని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా 1769 లో ఆధునిక ఆర్ధిక వ్యవస్థకు మూలపురుషుడని భావిస్తున్న ఆడమ్ స్మిత్ వ్యాఖ్యలను అమర్త్య సేన్ ప్రస్తావించారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్, అండ్ ఫిలాసఫీ ప్రొఫెసర్ గా ఉన్న అమర్త్య సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )