Indian Citizenship: రోజుకు 426 మంది గుడ్‌బై.. పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. ఎందుకంటే..
గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భారతీయులు.. దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఏకంగా 9 లక్షల మంది భారతీయులు.. తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం పార్లమెంటులో తెలిపింది.. ఇక గత 14 ఏళ్లలో ఈ సంఖ్య 20 లక్షలు దాటినట్లు తెలిపింది..

గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భారతీయులు.. దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఏకంగా 9 లక్షల మంది భారతీయులు.. తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం పార్లమెంటులో తెలిపింది.. ఇక గత 14 ఏళ్లలో ఈ సంఖ్య 20 లక్షలు దాటినట్లు తెలిపింది.. భారత పౌరసత్వాన్ని వదిలేసి.. విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. గడిచిన ఐదేళ్లలోనే సుమారు 9 లక్షల మంది ఇండియన్ సిటిజన్‌షిప్‌ను త్యజించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే 11 ఏళ్లలో 17 లక్షల మంది, 14 ఏళ్లలో .. 2011 నుంచి మొత్తం 20 లక్షల మంది భారతీయులు పౌరసత్వానికి గుడ్‌బై చెప్పినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు సగటున 426 మంది దేశాన్ని వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా.. గత 5 ఏళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు.. తమ పౌరసత్వాన్ని వదిలేసుకుని ఇతర దేశాల పౌరసత్వాలను తీసుకున్నట్లు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు.
గత ఏడాది ఒక్కటే దాదాపు 2 లక్షల మందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2024లో ఇప్పటివరకు 2,06,378 మంది ఇండియన్ సిటిజన్‌షిప్‌ను త్యజించారు. నెలకు సగటున 12,960 మంది, గంటకు 18 మంది దేశ పౌరసత్వాన్ని వదులుతున్న పరిస్థితి నెలకొంది. పౌరసత్వం వదులుకునే ప్రధాన గమ్యస్థానాలుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ముందున్నాయి. మెరుగైన జీవన ప్రమాణాలు, స్థిరమైన ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు.. అక్కడే స్థిరపడాలన్న ఆలోచన ఈ దేశాల వైపు భారతీయులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా.. నిరుద్యోగం పెరుగుదల, విదేశాల్లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న భావనతో చాలా మంది పౌరసత్వాన్ని త్యజిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సంవత్సరాల వారీగా చూస్తే 2014లో 1,29,328 మంది పౌరసత్వాన్ని వదులుకోగా, 2022లో ఈ సంఖ్య 2,25,620కి చేరింది. 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది దేశానికి గుడ్‌బై చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
