AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం అంటే ఇదేనేమో.. యముడికే మస్కా కొట్టి మృత్యుంజయుడైన ఒకే ఒక్కడు!

ప్రకృతిలో జరిగే కొన్ని ప్రమాదాలు.. అప్పుడప్పుడు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొందరు చిన్న ప్రమాదానికే ప్రాణాలు కోల్పోతే.. మరి కొందరు మాత్రం ఘోర ప్రమాదాల నుంచి కూడా అవలీగా తప్పించుకొని ప్రాణాలతో బయటపడుతారు. తాజాగా అలాంటి ఘటనే ఆరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. 200 మీటర్ల ఎత్తుపై నుంచి పడిపోయినా.. 22 మందిలో ఒకే ఒక వ్యక్తి మాత్రం అమరుడై తిరిగోచ్చాడు. ప్రస్తుతం అతను అస్సాంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

అద్భుతం అంటే ఇదేనేమో.. యముడికే మస్కా కొట్టి మృత్యుంజయుడైన ఒకే ఒక్కడు!
Anand T
|

Updated on: Dec 13, 2025 | 12:16 PM

Share

200 మీటర్ల ఎత్తైన కొండపై నుంచి లోయలో పడిపోయిన 22 మందిలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. తీవ్ర గాయాలైన 22 ఏళ్ల బుధేశ్వర్ దీప్‌ను గమనించిన స్థానికులు.. అతన్ని వెంటనే అస్సాంలోని దిబ్రుగఢ్‌లోని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అతని వైద్య సంరక్షణలో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 8 సాయంత్రం చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న హయులియాంగ్ పట్టణం నుండి 40 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అస్సాంలోని టిన్సుకియాకు చెందిన 22 మందితో వెళ్తున్న ఒక మినీ ట్రక్కు అదుపుతప్పి కొండమై నుంచి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.

అయితే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 22 ఏళ్ల బుధేశ్వర్ దీప్ అనే యువకుడు.. అతి కష్టమీద కొండెక్కి రెండ్రోజుల తర్వాత స్థానిక అధికారులను సంప్రదించి.. జరిగిన విషయం చెప్పాడు. దీంతో మొదట అతన్ని హాస్పిటల్‌కు తరలించిన అధికారులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పర్వత ప్రాంతం దాదాపు 90 డిగ్రీల వాలులో ఉండడంతో అక్కడి నుంచి మృతదేహాలను వెలికితీయడం కష్టతరంగా మారింది. అయినప్పటికీ అతి కష్టం మీ ఇప్పటి వరకు ఆరుగురి మృతదేమాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారి మృతదేహాల కోసం సాహాయక చర్యలు కొనసాగుతున్న పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో తాము ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసిందని.. కానీ తాము కేవలం 15 మృతదేహాలను మాత్రమే గుర్తించామని.. వాటిలో ఆరుంటిని వెలికి తీసినట్టు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఒక్కడు మాత్రం అంత ఎత్తు నుంచి పడిన ఎలా ప్రాణాలతో భయటపడ్డాడో ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా లేదు కాబట్టి.. ఈ సంఘటన గురించి పెద్దగా అతన్ని అడగలేదన్నారు.

ఇక బుధేశ్వర్‌కు వైద్య చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. అనికి తుంటి ఎముకలు విరిగిపోయాయని, ఊపిరితిత్తులు, మెదడుకు గాయాలు అయ్యాయని తెలిపారు. కానీ అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. ఇంతటి గాయాలైనప్పటికీ అతను అంతపెద్ద పర్యాతాన్ని ఎక్కడమనేది నిజంగా అద్భుతం అని ఆయన అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యముడికే మస్కా కొట్టి మృత్యుంజయుడైన ఒకే ఒక్కడు
యముడికే మస్కా కొట్టి మృత్యుంజయుడైన ఒకే ఒక్కడు
మెడ నొప్పి.. డాక్టరమ్మ జీవితాన్నే మార్చేసింది..
మెడ నొప్పి.. డాక్టరమ్మ జీవితాన్నే మార్చేసింది..
ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం
ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం
30 రోజులు మాంసం మానేస్తే ఏమౌతుందో తెలుసా..?శరీరంలో జరిగే మార్పులు
30 రోజులు మాంసం మానేస్తే ఏమౌతుందో తెలుసా..?శరీరంలో జరిగే మార్పులు
ఒక్కసారిగా దూసుకొచ్చిన 30మంది.. భయంతో ట్రైన్ వాష్‌రూమ్‌లో..
ఒక్కసారిగా దూసుకొచ్చిన 30మంది.. భయంతో ట్రైన్ వాష్‌రూమ్‌లో..
మళ్లీ అడ్డంగా దొరికిన తనూజ.. ఓపక్క బాధతో అల్లాడిపోయిన ఇమ్మూ..
మళ్లీ అడ్డంగా దొరికిన తనూజ.. ఓపక్క బాధతో అల్లాడిపోయిన ఇమ్మూ..
ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్
ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్
ఆఫర్‌ మిస్సవ్వకండి.. ఐఫోన్ 15 ప్రోపై రూ.71,000 వరకు తగ్గింపు..!
ఆఫర్‌ మిస్సవ్వకండి.. ఐఫోన్ 15 ప్రోపై రూ.71,000 వరకు తగ్గింపు..!
2025లో జరిగిన గొప్ప వేడుకలు..వెంటాడిన విషాదాలు.. గుర్తుకు వస్తేనే
2025లో జరిగిన గొప్ప వేడుకలు..వెంటాడిన విషాదాలు.. గుర్తుకు వస్తేనే
బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్