Rescued: ఈ బుడ్డోడు నిజంగానే మృత్యుంజయుడు.. 300 అడుగుల లోతు బోరు బావిలో పడినా.. వైరల్‌ అవుతోన్న వీడియో.

Rescued Borewell: చిన్నారులు బోరు బావిలో పడి మరణించిన సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. అధికారులు ఎంత కష్టపడ్డా చిన్నారులను ప్రాణాలతో రక్షించని ఉదంతాలు విన్నాం...

Rescued: ఈ బుడ్డోడు నిజంగానే మృత్యుంజయుడు.. 300 అడుగుల లోతు బోరు బావిలో పడినా.. వైరల్‌ అవుతోన్న వీడియో.
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 09, 2022 | 10:14 AM

Rescued Borewell: చిన్నారులు బోరు బావిలో పడి మరణించిన సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. అధికారులు ఎంత కష్టపడ్డా చిన్నారులను ప్రాణాలతో రక్షించని ఉదంతాలు విన్నాం. ఇలా బోరు బావిలో చిన్నారులు పడ్డ సంఘటనలన్నీ చివరికి విషాదంగా మారినవే ఎక్కువ. అయితే తాజాగా గుజరాత్‌లో అద్భుతం జరిగింది. 300 అడుగుల లోతులో ఉన్న బోర్‌ బావిలో పడ్డ ఓ కుర్రాడు సజీవంగా బయటకు వచ్చాడు. దీంతో ఈ కుర్రాడు నిజంగానే మృత్యుంజయుడు అంటూ కీర్తిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లా ధృంగధర తాలూకాలో రుధ్‌పూర్‌లో 18 నెలల శివమ్‌ అనే బాలుడు ఆడుతూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. దీంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటలన స్థలానికి చేరుకున్న ఆర్మీ క్విక్ రియాక్షన్ బాలుడిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ బాలుడు 25 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. బాలుడు అరపులు వినిపిస్తుండడంతో కెప్టెన్‌ సౌరవ్‌ ఆధ్వర్యంలోని ఆర్మీ వెంటనే రెస్క్యూ మెదలు పెట్టింది. మెటాలిక్‌ హుక్‌ను తగిలించిన ఓ తాడును బోరు బావిలోకి విడిచారు. 40 నిమిషాల కృషి అనంతరం.. అదృష్టవశాత్తు ఆ హుక్‌ బాలుడు టీషర్ట్‌కు తగిలింది. దీంతో వెంటనే బాలుడిని పైకి లాగారు. బాలుడు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

బాలుడిని బయటకు తీసిన వెంటనే సురేంద్రనగర్‌లోని సియుషా ఆసుపత్రికి తరలించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి వీడియోను గుజరాత్‌ డిఫెన్స్‌ పీఆర్‌వో ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ఆర్మీ వ్యవహరించిన చాకచక్యానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడికి చిన్న గాయం కూడా కాకుండా బయటకు తీయడంతో ఈ వీడియో చూసిన వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..