Vijay Diwas: భారత్ సగర్వంగా తల ఎత్తుకునే రోజు.. ‘విజయ్ దివాస్’ ఎందుకు జరుపుకుంటామో తెలుసా..?

1971 India Pakistan War: డిసెంబర్ 16వ తేదీ భారతదేశంతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చాలా చిరస్మరణీయమైన రోజు. ఈ రోజు భారతదేశం బంగ్లాదేశ్‌లకు గర్వంగా తల ఎత్తుకునే అవకాశాన్ని కల్పిస్తుండగా, పాకిస్తాన్ తల దించుకున్న రోజు.

Vijay Diwas: భారత్ సగర్వంగా తల ఎత్తుకునే రోజు.. ‘విజయ్ దివాస్’ ఎందుకు జరుపుకుంటామో తెలుసా..?
Vijay Diwas
Follow us
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 11, 2022 | 9:42 AM

India – Pakistan War 1971: డిసెంబర్ 16వ తేదీ భారతదేశంతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చాలా చిరస్మరణీయమైన రోజు. ఈ రోజు భారతదేశం బంగ్లాదేశ్‌లకు గర్వంగా తల ఎత్తుకునే అవకాశాన్ని కల్పిస్తుండగా, పాకిస్తాన్ తల దించుకున్న రోజు. 1971లో పాకిస్తాన్‌‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. పాకిస్తాన్‌‌పై విజయాన్ని భారత్ విజయ్ దివస్‌గా జరుపుకుంటుంది. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున పాకిస్తాన్‌ రెండు ముక్కలైంది. పాకిస్థానం సైన్యం భారతదేశం పరాక్రమం ముందు లొంగిపోయింది.

ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సైన్యం అతిపెద్ద లొంగుబాటుగా కూడా పరిగణిస్తారు. పాకిస్తాన్ అహంకారంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. దాని కారణంగా భారతదేశంలోని 11 ఎయిర్ బేస్‌లపై దాడి చేశాడు. భారతదేశంలోని త్రివిధ దళాలు కలిసి పోరాడడం బహుశా ఇదే మొదటిసారి. పశ్చిమాన పాకిస్తాన్‌ సైన్యం చర్యలకు భారత్ వెంటనే స్పందించి దాదాపు 15,010 కి.మీ పాకిస్తాన్‌ భూభాగాన్ని ఆక్రమించింది.

సైన్యంతో లొంగిపోయిన పాకిస్తాన్‌ జనరల్ ఏకే నియాజీ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం ముందు లొంగిపోయారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముక్తి బహిని సంయుక్త బలగాలకు లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది. జనరల్ AK నియాజీ 16 డిసెంబర్ 1971న ఢాకాలో లొంగిపోతున్నట్లు దస్తావేజుపై సంతకం చేశారు. దీంతో తూర్పు పాకిస్తాన్‌లో కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటానికి దారితీసింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావంతో పాకిస్తాన్‌‌ కూడా సగం భూభాగాన్ని కోల్పోయింది.

13 రోజుల యుద్ధం  యుద్ధం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. చరిత్రలో అతి తక్కువ యుద్ధాలలో ఒకటిగా పరిగణిస్తారు. కానీ దాని ఫలితం పాకిస్తాన్‌‌కు ఈనాటికీ సిగ్గుపడుతున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ 3 డిసెంబర్ 1971 నుండి 16 డిసెంబర్ 1971 వరకు జరిగింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని మోకాళ్లపైకి తెచ్చింది. దాని ఫలితంగా 93,000 మంది సైనికులను స్వాధీనం చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని 75 మిలియన్ల ప్రజలకు స్వాతంత్ర్యం తెచ్చింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్తాన్ చేసిన మారణహోమాన్ని అంతం చేయడానికి జరిగిన ఈ యుద్ధంలో 3000 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీనితో పాటు 8,000 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం సిద్ధించింది.

హిందూ జనాభాను చంపిన పాకిస్తాన్ పూర్వపు తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందడానికి పోరాడుతోంది. 1971లో, పాకిస్తాన్ సైన్యం అమాయక బెంగాలీ జనాభాపై, ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్‌లోని మైనారిటీ హిందూ జనాభాపై క్రూరమైన ఊచకోతలకు పాల్పడింది. పాకిస్తాన్ దుశ్చర్యలు పెరిగినప్పుడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో సరిహద్దుకు అవతలి వైపున ఉన్న పౌరులకు ఆశ్రయం కల్పించారు. ఈ తరుణంలోనే అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ.. పాకిస్తాన్‌పై దాడిని ప్రారంభించాలని ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాను ఆదేశించారు. దాని తర్వాత భారతదేశం తన పొరుగుదేశంపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది.

పాకిస్తాన్ మారణహోమంలో లక్షలాది మంది.. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో 3,00,000 మంది పౌరులు మరణించారని అంచనా. దీని తరువాత అత్యాచారం, చిత్రహింసలు, హత్యలు, సంఘర్షణలు జరిగాయి. దీని కారణంగా 8 మిలియన్ల నుండి 10 మిలియన్ల మంది ప్రజలు భారతదేశంలో ఆశ్రయం పొందేందుకు దేశాన్ని విడిచిపెట్టారు. తూర్పు పాకిస్తాన్ నుండి నిరంతరం శరణార్థులు రావడంతో దేశం ఇప్పటికే భారం పడుతోంది మరియు యుద్ధంలోకి ప్రవేశించడం అంటే మరిన్ని భారాలను ఆహ్వానించడం వల్ల ఇందిరా గాంధీ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించడానికి ఇష్టపడలేదు.

ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి పాకిస్తాన్ తన క్రూరత్వాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని, ఒత్తిడి చేయవలసిందిగా ప్రపంచ నాయకులకు కూడా ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేశారు. అయితే, భారతదేశానికి ఎక్కువ సమయం లేదు. ఆ త్వరగా వెంటనే స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 6న, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించిందని ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రకటించారు. యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 2 ఆగస్ట్ 1972న, భారతదేశం పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం మొత్తం 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది.

నాటి యుద్ధ వీరుడి భార్య పాదాలకు రక్షణమంత్రి వందనం ఇదిలావుంటే,1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధ వీరులను స్మరించుకుని, గౌరవించుకునేందుకు స్వర్ణిం విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో దేశం విజయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కల్నల్ హోషియార్ సింగ్ భార్యను కలిసి పలకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్.. ఆమె పాదాలకు నమస్కరించి వారి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధం పూర్తయి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Read Also…. CJI NV Ramana: మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం మాయమైంది.. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు