పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకొచ్చాడని.. భర్త తాగే కాఫీలో..!
ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ భార్య తన భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి, తిరిగి రావడంతో వారి మధ్య విభేదాలు కొనసాగాయి. చివరికి భార్య విషం కలిపిన కాఫీ ఇవ్వడంతో భర్త ఆస్పత్రి పాలయ్యాడు. భర్త సోదరి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్తతో విభేదాలు వస్తున్నాయని ఓ భార్య అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. కానీ, పెద్దలు, పోలీసులు పంచాయితీ చేసి భార్యను కాపురానికి తీసుకెళ్లాలని ఆ భర్తకు సూచించడంతో.. తన భార్యను కాపురానికి తీసుకొచ్చాడు భర్త. కానీ, వచ్చి రావడంతోనే తాను ఓ పని మీద ఇక్కడికి వచ్చానంటూ భర్త కుటుంబ సభ్యులకు ఆమె షాకిచ్చింది. వారం తిరిగే సరికి ఆ భర్త ఆస్పత్రి పాలయ్యాడు. తన అన్నను చంపేందుకు వదిన కాఫీలో విషం కలిపి ఇచ్చిందంటూ ఆమె ఆడపడుచు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు మొత్తం వ్యవహారం బయటపడింది. ప్రియుడితో సరసాల కోసం భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి.. అతను తాగే కాఫీలో విషయం కలిపి ఇచ్చిన దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖతౌలిలోని భంగేలా గ్రామానికి చెందిన అనుజ్ శర్మ రెండేళ్ల క్రితం ఫరూఖ్‌నగర్‌కు చెందిన పింకి అలియాస్ సనాను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత వారి విభేదాలు మొదలయ్యాయి. దీంతో పింకి పుట్టింటికి వెళ్లిపోయి.. భర్త అనుజ్‌పై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు కూడా పెట్టింది. పోలీసుల మధ్యవర్తిత్వం తర్వాత, అనుజ్ పింకీని వారం రోజుల కింద ఇంటికి తీసుకురావడానికి అంగీకరించాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య వివాదాలు కొనసాగాయి. మార్చి 25న అనుజ్ ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అనుజ్ కుటుంబ సభ్యులకు పింకీపై అనుమానం వచ్చి.. అనుజ్‌కు ఆమె కాఫీలో విషం కలిపి ఇచ్చిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గొడవల తర్వాత ఆమె తిరిగి కాపురానికి వచ్చిన సమయంలో.. తాను ఒక పని మీద ఒక్కడి వచ్చానని తమతో చెప్పినట్లు కూడా అనుజ్ కుటుంబ సభ్యులకు పోలీసులకు తెలియజేశారు. పెళ్లికి ముందు పింకీ మరొక వ్యక్తిని ప్రేమించిందని, అతనితో తరచుగా ఫోన్‌లో మాట్లాడేదని అనుజ్ సోదరి ఆరోపించింది. ఈ విషయంలో అనుజ్ ఆమెను హెచ్చరించినప్పటికీ ఆమె అతనితో వివాహేతర బంధం కొనసాగించినట్లు పేర్కొంది. అనుజ్ పనికి వెళ్లగానే పింకి తన ప్రేమికుడితో మాట్లాడేదని, అతనే కాకుండా తన మేనల్లుడితో కూడా పింకీ శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అనుజ్ సోదరి మీనాక్షి పేర్కొంది. ఈ విషయాల్లోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే.. చివరికి ఎలాగైన మా అన్నను చంపాలని కాఫీలో విషయం కలిపి ఇచ్చిందంటూ మీనాక్షి ఆరోపించింది. ఒక వైపు తన అన్న ఆస్పత్రిలో ఐసీయూలో ఉంటే పింకీ మాత్రం తన పుట్టింటికి వెళ్లిపోయిందంటూ పేర్కొంది. కాగా మీనాక్షి ఫిర్యాదుతో ఖతౌలి పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.