AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CJI NV Ramana: మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం మాయమైంది.. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు

దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం అనేది మీడియా నుంచి మాయమైపోయితుందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు​ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

CJI NV Ramana: మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం మాయమైంది.. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు
Cji Nv Ramana
Balaraju Goud
|

Updated on: Dec 16, 2021 | 12:16 PM

Share

CJI NV Ramana on Investigative journalism: దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం అనేది మీడియా నుంచి మాయమైపోయితుందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు​ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన గార్డెన్‌లో పూసే ప్రతీ పూవ్వు ఇప్పుడు అందంగానే కనిపిస్తోంది’ అంటూ ప్రసార మాధ్యమాల తీరును ఆయన తప్పుబట్టారు. సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల రచించిన పరిశోధనాత్మక బ్లద్ శాండర్స్ పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

వర్చువల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వార్తాపత్రికలు సమాజంలో అలజడి సృష్టించే కుంభకోణాలను బహిర్గతం చేసేవని, ఈ రోజుల్లో అలాంటి పేలుడు కథనాలు లేవని అన్నారు. “ప్రస్తుత మీడియా కొన్ని ఆలోచనలను పంచుకోవడానికి నేను స్వేచ్ఛ తీసుకుంటున్నాను. పరిశోధనాత్మక జర్నలిజం అనే భావన, దురదృష్టవశాత్తు, మీడియా కాన్వాస్ నుండి కనుమరుగవుతోంది” అని జస్టిస్ రమణ అన్నారు. గతంలో పెద్ద పెద్ద కుంభకోణాలను బహిర్గతం చేసే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లని, సమాజంపై దుష్ప్రవర్తనపై వార్తాపత్రిక నివేదికలు తీవ్ర పరిణామాలకు దారితీశాయి. ఒకటి రెండు మినహా, ఇంత పెద్ద కథనాలు ప్రస్తుత కాలంలో కనిపించడంలేదన్నారు. వ్యక్తులు, సంస్థల సమిష్టి వైఫల్యాలను మీడియా హైలైట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా వ్యవస్థలోని లోపాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ అన్నారు.

‘బ్లడ్‌ సాండర్స్‌’ పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు, చెట్ల నరికివేత, ముఠాలపై ఈ పుస్తకంలో అచ్చుగుద్దినట్లు రచయిత చెప్పారని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. ఎర్రచందనం చెట్ల నరికివేత కేవలం జాతిసంపదను హరించడమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుందని జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. గత రెండు దశాబ్దాల కాలంలో అరవై లక్షల ఎర్ర చందనం చెట్లను నరికివేసినట్లు రచయిత చెప్పడం ఆందోళన కల్గిస్తుందన్నారు. దాదాపు 5,30,097 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం అడవుల్లో రెండు వేల మంది స్మగ్లర్లను ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారన్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. బ్లడ్ సాండర్స్ పుస్తకం వెనక రచయిత సుధాకర్ రెడ్డి చేసిన పరిశోధన, కృషి ఎంతో దాగి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు.

Read Also…  Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న మద్దతు.. సంప్రదాయ పద్ధతుల్లో అధిక లాభాలు అంటున్న సుభాష్ పాలేకర్