AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNSC: భద్రతామండలి పని తీరును ప్రపంచ దేశాలు ప్రశ్నించాలి.. భారత్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇరుదేశాల మధ్య ఈ యుద్ధం మొదలై ఏడాదిన్నర పూర్తైన కూడా ఇప్పటికీ ఈ సంక్షోభం కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన భారత్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. అంతర్జాతీయంగా శాంతి స్థాపన నెలకొల్పేందుకు కృషి చేయాల్సిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. ఈ వివాదాన్ని పరిష్కరించే విషయంలో అసలు ఎందుకు సమర్థవంతంగా పని చేయడం లేదంటూ ప్రశ్నల వర్షం కురుపించింది.

UNSC: భద్రతామండలి పని తీరును ప్రపంచ దేశాలు ప్రశ్నించాలి.. భారత్ కీలక వ్యాఖ్యలు
Ministry Of External Affairs Sanjay Verma
Aravind B
|

Updated on: Sep 22, 2023 | 8:32 PM

Share

ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇరుదేశాల మధ్య ఈ యుద్ధం మొదలై ఏడాదిన్నర పూర్తైన కూడా ఇప్పటికీ ఈ సంక్షోభం కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన భారత్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. అంతర్జాతీయంగా శాంతి స్థాపన నెలకొల్పేందుకు కృషి చేయాల్సిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. ఈ వివాదాన్ని పరిష్కరించే విషయంలో అసలు ఎందుకు సమర్థవంతంగా పని చేయడం లేదంటూ ప్రశ్నల వర్షం కురుపించింది. తాజాగా ఐరాస భద్రతా మండలి సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసింది. అయితే ఈ సమావేశాల్లో మాట్లాడిన భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సంజయ్‌ వర్మ ఈ విషయాన్ని లేవనెత్తారు. అంతేకాదు ఇదే విషయంపై ప్రపంచ దేశాలు కూడా ప్రశ్నలు సంధించాయి.

అయితే ప్రస్తుత తరుణంలో మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సంజయ్‌ వర్మ అన్నారు . ఉక్రెయిన్‌- రష్యా మధ్య నెలకొన్న వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి సమీపంలో ఉన్నామా..? ఒకవేళ లేకపోతే అలాంటప్పుడు ఈ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వ్యవస్థ ఎందుకు ఉన్నట్లని ప్రశ్నించారు. అయితే ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనే విషయంలో అసమర్థత ఉన్నట్లే కదా అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్నటువంటి ఈ సంక్షోభం వల్ల ఆహార ధరలు, ఇంధనం, ఎరువుల ధరలు పెరగడం వంటి పర్యవసానాలను ఇప్పటికీ చూస్తున్నామని పేర్కొన్నారు. వీటివల్ల అత్యంత ప్రభావితమవుతోన్న గ్లోబల్‌ సౌత్ గళం వినడం అనేది ఎంతో ముఖ్యమని అన్నారు.

ఇదిలా ఉండగా.. మరో విషయం ఏంటంటే భిన్న దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలంటే.. కాలం చెల్లిన విధానాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ అలాగా లేకపోతే వాటిపై విశ్వసనీయత క్షీణిస్తూనే ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దకపోతే.. ఎప్పుడూ కూడా ఆశావహులుగానే మిగిలిపోతామంటూ భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సంజయ్‌ వర్మ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత వైఖరిని మరోసారి స్పష్టం చేసిన సంజయ్‌ వర్మ .. ఈ అంశంపై భారత్‌ ఎప్పుడూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందని వివరించారు. అలాగే దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వాలను తగ్గించుకొని.. అలాగే పోరాటానికి ముగింపు పలికడం కోసం యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. అయితే ఇందుకు చర్చలు మాత్రమే పరిష్కార మార్గమంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం