Corona In India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 8 వేలకు పైగా కొత్త కరోనా ( Covid19 ) కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం ఒక ప్రకటన వెలువరించింది. రోజురోజుకీ కరోనా యాక్టివ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని.. ప్రస్తుతం దేశంలో 48 వేల క్రియాశీలక కరోనా కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో, 8084 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,32,30,101 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖగణాంకాల ప్రకారం, ఆదివారం మరో 10 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,24,771 కు పెరిగింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 చొప్పున నమోదయ్యాయి.
కాగా గత 24 గంటల్లో 4,592 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరాయి. అదేవిధంగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India reports 8,084 COVID19 cases and 10 deaths. Active cases rise to 47,995. Daily positivity 3.24% pic.twitter.com/hW2FQsIf17
— ANI (@ANI) June 13, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..
IND vs SA: కటక్‌లో టీమిండియా ఓటమికి కారణాలివే.. కొంపముంచిన బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు..