India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 31 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మరింత పడిపోయింది. శుక్రవారం నాడు 51,667 పాజిటివ్ కేసులు..

India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 31 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..
Vaccination Corona
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 2:11 PM

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మరింత పడిపోయింది. శుక్రవారం నాడు 51,667 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. తాజాగా ఆ సంఖ్య 3 వేలు తగ్గి.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 48,689 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 17,45,809 సాంపిల్స్ పరీక్షించారు. ఇదే సమయంలో భారీ స్థాయిలో రికవరీలు నమోదు అయ్యాయి. 64,818 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం నాడు భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటెన్‌ను విడుదల చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,01,83,143 లకు చేరింది. అలాగే రికవరీ సంఖ్య 2,91,93,085 లకు చేరింది. కరోనా ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5,95,565 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కివరీ రేటు 96.72 శాతం ఉండగా.. పాజిటివ్ రేటు 1.97 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.31 శాతం ఉంది.

ఇక శుక్రవారం ఒక్క రోజు 61,19,169 కోవిడ్ వ్యాక్సీన్ డోసులను లబ్ధిదారులకు వేశారు. మొత్తంగా వ్యాక్సీనేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 కోట్లు(31,50,45,926) వ్యాక్సీన్ డోసులను వేశారు.

Also read:

KGF Garuda Ram : KGF గరుడ కొత్త రూపాన్ని మీరు చూశారా..! మళ్లీ భయంకరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..