India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

|

Aug 06, 2021 | 9:54 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
India Corona Updates
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మళ్లీ 40 వేలకు పైగా కేసులు నమోదవుతోంది. గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 464 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,26,754 కి చేరింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 41,096 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,15,844 కి పెరిగింది. అయితే.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4,14,159 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 49,53,27,595 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా నిన్న నమోదైన కేసుల్లో.. అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 9వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 1.30 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది.

Also Read:

TS Crime: వేధింపులు తాళలేక.. కొడుకును హత్యచేసిన తండ్రి.. కత్తితో దారుణంగా..

Vaccine: బూస్టర్ డోసుపై డబ్ల్యూహెచ్‌వో కీలక సూచన.. మూడో డోసు ఇక అప్పుడేనా