AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World AIDS Day: ఇది కదా మార్పంటే.. భారీగా తగ్గిన “ఆ” మరణాలు.. ఆరోగ్యశాఖ ప్రకటనలో..

2010 నుండి 2024 మధ్య భారతదేశం HIV/AIDS నియంత్రణలో అద్భుతమైన ప్రగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ‘ప్రపంచ AIDS దినోత్సవం 2025’ సందర్భంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో వార్షిక కొత్త HIV ఇన్ఫెక్షన్లు 48.7 శాతం తగ్గగా, AIDS సంబంధిత మరణాలు 81.4 శాతం తగ్గాయి తల్లి నుండి బిడ్డకు సోకే HIV కేసులు 74.6 శాతం తగ్గినట్టు కేంద్రం పేర్కొంది.

World AIDS Day: ఇది కదా మార్పంటే.. భారీగా తగ్గిన ఆ మరణాలు.. ఆరోగ్యశాఖ ప్రకటనలో..
World Aids Day
Anand T
|

Updated on: Dec 01, 2025 | 10:15 AM

Share

ప్రపంచ AIDS దినోత్సవానికి ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2010 నుండి 2024 మధ్య భారతదేశం HIV , AIDS నియంత్రణలో అద్భుతమైన ప్రగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. జాతీయ AIDS నియంత్రణ కార్యక్రమం ప్రస్తుత దశలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 2020–21 నుండి 2024–25 వరకు HIV పరీక్షలు 4.13 కోట్ల నుండి 6.62 కోట్లకు పెరినట్టు తెలిపింది. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) పొందుతున్న PLHIV సంఖ్య 14.94 లక్షల నుండి 18.60 లక్షలకు పెరిగినట్టు పేర్కొంది. అలాగే వైరల్ లోడ్ పరీక్షలు 8.90 లక్షల నుండి 15.98 లక్షలకు పెరిగాయని చెప్పుకొచ్చింది. ఈ విజయాలన్ని భారతదేశం HIV,AIDS నిర్మూలన లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తోందనడానికి నిదర్శనమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సీనియర్ అధికారుల సమక్షంలో జరిగే జాతీయ స్థాయి ‘ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం’కు ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నాయకత్వం వహించనున్నారు. ఇది హెచ్‌ఐవి నివారణ, చికిత్స, సంరక్షణ, కళంకం నిర్మూలనకు జాతీయ ప్రతిస్పందనను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను మరోసారి తెలియజేయనుంది.

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నాయకులు, అభివృద్ధి భాగస్వాములు, యువ ప్రతినిధులు, సామాజిక న్యాయవాదులు, హెచ్‌ఐవి (PLHIV)తో జీవిస్తున్న వ్యక్తులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను ఒక్క తాటిపైకి వచ్చి, ఇది భారతదేశంలో ప్రజారోగ్య ముప్పుగా ఉన్న ఎయిడ్స్‌ను అంతం చేసే దిశగా సాగుతున్న ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి ఐక్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

యువత నేతృత్వంలో జరిగే ఫ్లాష్ మాబ్ ప్రదర్శన ద్వారా ఎయిడ్స్ అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తన ప్రాముఖ్యతను గట్టిగా నొక్కి చెప్పనున్నారు. తర్వాత జాతీయ ఎయిడ్స్, STD నియంత్రణ కార్యక్రమం కింద అమలవుతున్న డిజిటల్ ఆవిష్కరణలు, కార్యక్రమ విజయాలు, కమ్యూనిటీ నేతృత్వంలోని విజయవంతమైన మోడళ్లను ప్రదర్శించే నేపథ్య ప్రదర్శన (ఎగ్జిబిషన్) ప్రారంభమవుతుంది. లబ్ధిదారుల అనుభవ కథనాలు, ఆడియో-విజువల్ ప్రెజెంటేషన్‌ల ద్వారా NACP-V కింద భారతదేశం సాధించిన పురోగతి, రాబోయే ప్రాధాన్యతలను హైలైట్ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us