Biggest Breaking: భారత్ మాతాకీ జై.. ‘ఆపరేషన్ సింధూర్’.. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు..
భారత్ మాతాకి జై.. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది.

భారత్ మాతాకి జై.. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. అటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్‌తో భారత్ విరుచుకుపడగా.. అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక ఇండియన్ ఆర్మీ.. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట ‘జస్టిస్ ఈజ్ సర్వ్‌డ్.. జై హింద్’ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, ఇండియన్ ఆర్మీ.. పీఓకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది.
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
#WATCH | #OperationSindoor | Heavy exchange of artillery fire at LoC in J&K (exact location not being disclosed). pic.twitter.com/qqd7Z1A8tU
— ANI (@ANI) May 6, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నిమిషం.. రాత్రంతా ఈ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్‌పై నిరంతరం అప్‌డేట్స్ తెలుసుకుంటూ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ విజయవంతంగా మెరుపు దాడులు చేసినట్టు తెలుస్తోంది.
Prime Minister Narendra Modi is constantly monitoring Operation Sindoor throughout the night. The strike on all nine targets is successful: Sources to ANI pic.twitter.com/7ICP5BJNR6
— ANI (@ANI) May 6, 2025
ఇండియన్ ఆర్మీ.. పీఓకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత్ ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది. భారత మిస్సైల్ దాడులకు చాలామంది ప్రజలు చనిపోయారంటూ ఇండియాపై నిందలు మోపుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ‘ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని, పాక్ సైనిక సౌకర్యాలను, అలాగే పాక్ ప్రజలను టార్గెట్ చేయలేదని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘లక్ష్యాల ఎంపిక, అమలులో ఆర్మీ అత్యంత సంయమనం పాటించింది. పహల్గాం దాడికి బదులుగా ఈ చర్య చేపట్టాం. బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నాం’. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవాళ మధ్యాహ్నం వెల్లడిస్తాం అని పేర్కొంది.
India has launched #OperationSindoor, a precise and restrained response to the barbaric #PahalgamTerrorAttack that claimed 26 lives, including one Nepali citizen. Focused strikes were carried out on nine #terrorist infrastructure sites in Pakistan and Pakistan-occupied Jammu and…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 6, 2025
ఇదిలా ఉంటే.. భారత్ ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని ఐదు ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ద చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్‌కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు.
#OperationSindoor | Pakistan Prime Minister Shehbaz Sharif tweets “The cunning enemy has carried out cowardly attacks on five locations in Pakistan. Pakistan has every right to respond forcefully to this act of war imposed by India, and a forceful response is being given. The… pic.twitter.com/SAfeNvusbN
— ANI (@ANI) May 6, 2025
అటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుబెట్టడంపై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ప్రెస్ మీట్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. ‘ఇప్పుడే ఓవల్ ఆఫీస్‌లోకి వస్తుండగా మేం ఆ న్యూస్ విన్నాం. అక్కడేదో జరిగిందని తెలిసింది. అతి త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నా. వాళ్లు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
#WATCH | #OperationSindoor | US President Donald Trump’s first comments on Indian strikes inside Pakistan.
US President says “It’s a shame. We just heard about it as we were walking in the doors of the Oval. I guess people knew something was going to happen based on a little bit… pic.twitter.com/KFdNC1OCJT
— ANI (@ANI) May 6, 2025
ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన మెరుపు దాడులపై కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజిని త్యాగ్ చేస్తూ ఆయన ‘జై హింద్’ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, పహల్గాం టెర్రర్ ఎటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చారు.
Andhra Pradesh CM N Chandrababu Naidu tweets, “Jai Hind! 🇮🇳”#OperationSindoor pic.twitter.com/VdgXXQFrVq
— ANI (@ANI) May 6, 2025
“Bharat Mata ki Jai: Rajnath Singh hails Indian Army after ‘Operation Sindoor’ strikes 9 terror camps in PoJK
Read @ANI story | https://t.co/AM96cu4fSX#BharatMatakiJai #RajnathSingh #OperationSindoor #PoJK pic.twitter.com/wQnzse38WJ
— ANI Digital (@ani_digital) May 6, 2025
“जय हिंद 🇮🇳 भारत माता की जय !”, posts Maharashtra CM Devendra Fadnavis (@Dev_Fadnavis). pic.twitter.com/m49gnfBiyK
— Press Trust of India (@PTI_News) May 6, 2025
“जय हिंद! जय भारत! न आतंक रहे, न अलगाववाद रहे! हमें अपने वीर जवानों और भारतीय सेना पर गर्व है #IndianArmy“, posts RJD leader Tejashwi Yadav (@yadavtejashwi). pic.twitter.com/wY9P509ML1
— Press Trust of India (@PTI_News) May 6, 2025
మరోవైపు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలెర్ట్‌గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అలాగే భారత్ మెరుపు దాడులకు పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఎల్‌ఓసీ వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ద ట్యాంకులను సరిహద్దులో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ.. సరిహద్దులలో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. భారత గగనతలంలోకి శత్రుదేశం నుంచి వచ్చే ఎలాంటి మిస్సైల్స్‌నైనా వెంటనే కూల్చేయడానికి సిద్దమైంది.
#WATCH | Visuals from an undisclosed location in J&K as the Indian Armed Forces launched ‘Operation Sindoor’, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir from where terrorist attacks against India have been planned and directed.… pic.twitter.com/3D20pDXkND
— ANI (@ANI) May 6, 2025
కాగా, భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు మరణించారని తెలుస్తోంది. బహావల్‌పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆజాద్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియా కూడా ధృవీకరించినట్టు సమాచారం.
Sources tell PTI that strikes were on JeM headquarters in Bahawalpur and LeT HQ in Muridke, both in Pakistan Punjab. #OperationSindoor pic.twitter.com/va8MWAmHZ6
— Press Trust of India (@PTI_News) May 6, 2025




