Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G 20 Summit 2023: వసుధైక కుటుంబం అనే థీమ్‌పై ఢిల్లీలో సమావేశం.. G-20 శిఖరాగ్ర సదస్సుకు విస్తృత ఏర్పాట్లు..

పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ - లైఫ్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సదస్సు ముగింపు సందర్భంగా చర్చించి అంశాలు, వివిధ కమిటీలు అంగీకరించిన విషయాలపై డిక్లరేషన్‌ విడుదల చేస్తారు. G20కి అధ్యక్షత వహించం దౌత్యపరంగా భారత్‌కు ఒక గొప్ప అవకాశం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.

G 20 Summit 2023: వసుధైక కుటుంబం అనే థీమ్‌పై ఢిల్లీలో సమావేశం.. G-20 శిఖరాగ్ర సదస్సుకు విస్తృత ఏర్పాట్లు..
G20 Summit 2023
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 04, 2023 | 2:04 PM

ఢిల్లీ, సెప్టెంబర్ 04: ఢిల్లీలో ఈ శని, ఆదివారాల్లో జరగనున్న G-20 శిఖరాగ్ర సదస్సుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. G-20 సంబంధించి ఇది 18వ శిఖరాగ్ర సమావేశం. వసుధైక కుటుంబకం – ఒక నేల, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌ అనే థీమ్‌పై ఢిల్లీ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. చరిత్రలో తొలిసారి G-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. భారత్‌ అధ్యక్షతన గతేడాది కాలంగా నిర్వహించిన వివిధ మంత్రుల కమిటీలు, వర్కింగ్‌ గ్రూప్స్‌, ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్స్‌ నిర్వహించిన కార్యకలాపాలను ఈ శిఖరాగ్ర సదస్సు సమీక్షించనుంది.

పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ – లైఫ్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సదస్సు ముగింపు సందర్భంగా చర్చించి అంశాలు, వివిధ కమిటీలు అంగీకరించిన విషయాలపై డిక్లరేషన్‌ విడుదల చేస్తారు. G20కి అధ్యక్షత వహించం దౌత్యపరంగా భారత్‌కు ఒక గొప్ప అవకాశం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.

గతేడాది డిసెంబర్‌ 1న G20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు భారత్‌ ఆ హోదాలో ఉంటుంది. G20లో ప్రస్తుతం 19 దేశాలు ప్లస్‌ యూరోపియన్‌ యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. G20 సదస్సు కోసం ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో G20 కీలక పాత్ర పోషిస్తుంది. 1999లో G20 ఏర్పాటైంది. ఆసియాలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నాటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రులు, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్లతో కూడిన ఫోరంగా G20 ఆవిర్భావించింది.

G-20 ఇరవై దేశాలతో కూడిన వేదిక అయినప్పటికీ ఢిల్లీలో జరిగే సమావేశంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్‌ మండపం కన్వెన్షన్‌ సెంటర్‌ G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమివ్వనుంది. దాదాపు 123 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న భారత మండపాన్ని 2,700 కోట్ల రూపాయలతో నిర్మించారు. మరో వైపు వివిధ దేశాల నేతలు ఢిల్లీకి రానున్న తరుణంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

సెప్టెంబర్‌ 8 నుంచి 11 తేదీల మధ్య 200లకు పైగా రైళ్లను ఉత్తర రైల్వే రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేసింది. ఈ రైళ్లన్నీ ఢిల్లీ నుంచి హర్యానా వైపు వెళ్లేవే. మరో వైపు ఈ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

G20లో సభ్యులుగా ఉన్న అనేక దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో-బైడన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూయేల్‌ మెక్రాన్‌ ఇందులో పాల్గొననున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ సమావేశానికి వస్తారని అనుకున్నా చివరి నిమిషంలో ఆయన ప్రయాణాన్ని మానుకున్నారు.

చైనా తరపున ఆ దేశ ప్రధాని లీ-క్వింగ్‌ సదస్సులో పాల్గొననున్నారు. G20లో సభ్యదేశాలు కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్‌, ఈజిప్టు, నెదర్లాండ్స్‌, మారిషస్‌, నైజీరియా, సింగపూర్‌, స్పెయిన్, UAE, ఒమన్ దేశాలను భారత్‌ సదస్సుకు ఆహ్వానించింది. అంతర్జాతీయ GDPలో G20 దేశాలు సంయుక్తంగా సుమారు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి.

అంతర్జాతీయ వ్యాపారంలో ఈ దేశాల వాటా 75 శాతానికి పైమాటే. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ఈ నెల ఏడుననే ఢిల్లీకి రానున్నారు. మరో వైపు భారత్‌ పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని జోబైడన్‌ ప్రకటించారు. G20 సదస్సుకు చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌ రాకపోవడం కొంత నిరాశ కలిగించిందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం