Independence Day 2022 Celebrations Highlights: ఈ ఏడాది 1.70 లక్షల కుటుంబాలకు దళిత బంధు.. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్‌..

Narender Vaitla

| Edited By: Subhash Goud

Updated on: Aug 15, 2022 | 2:33 PM

Independence Day 2022 Celebrations Highlights: స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడానికి యావత్‌ దేశం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వీధులన్నీ జెండాలతో నిండిపోయాయి..

Independence Day 2022 Celebrations Highlights:  ఈ ఏడాది 1.70 లక్షల కుటుంబాలకు దళిత బంధు.. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్‌..
Independence Day

Independence Day 2022 Celebrations Highlights: స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడానికి యావత్‌ దేశం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వీధులన్నీ జెండాలతో నిండిపోయాయి. ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. చిన్నా, పెద్దా అందరూ స్వాతంత్ర్య వేడుకలు సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన సందర్భాన, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును దేశ ప్రజలంతా కుల, మతాతలకు అతీతంగా జరుపుకుంటున్నారు.

గడిచిన రెండు రోజులుగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 జెండా పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుగుతోన్న సంబురాలకు సంబంధించిన వార్తా కథనాల లైవ్‌ అప్‌డేట్స్‌ని టీవీ9 ప్రత్యేకంగా మీకోసం అందిస్తోంది..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Aug 2022 10:49 AM (IST)

    దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ ఆదాయమే ఎక్కువ: సీఎం కేసీఆర్‌

    గోల్కోండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల పాటు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నాము. తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విరాజిల్లుతోంది. దేశానికి దూక్సూచిగా తెలంగాణ నిలుస్తోంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న, చేసిన అభివృద్ధి పనులు గురించి కేసీఆర్‌ ఏమన్నారంటే..

  • 15 Aug 2022 10:43 AM (IST)

    సీఎం కేసీఆర్ స్పీచ్..

  • 15 Aug 2022 09:54 AM (IST)

    జాతీయ జెండా ప్రజాస్వామ్యానికి ప్రతీక: జగన్‌ మోహన్‌ రెడ్డి

    విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీం జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జాతీయ జెండా భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె’ అని చెప్పుకొచ్చారు.

  • 15 Aug 2022 09:09 AM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్‌..

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న జగన్‌ జెండా ఎగరువేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

  • 15 Aug 2022 09:01 AM (IST)

    దేశం నవ సంకల్పంతో ముందుకెళుతోంది..

    దేశం నవసంకల్పంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట పై ఆయన వరుసగా 9వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈసందర్భంగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. తొలుత దేశ ప్రజలకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా శక్తి ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. ఎంతో మంది మహిళా మణులు ప్రాణత్యాగం చేశారని.. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. ఎంతో మంది మహానీయుల పేర్లను స్మరిస్తూ.. వారందరిని ఈసందర్భంగా గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివాసీలు స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తూ.. అల్లూరి సీతారామరాజు పేరును ప్రధాని స్మరించుకున్నారు. మహత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ వంటి మహానీయుల స్ఫూర్తితో దేశం ముందుకెళ్తోందన్నారు.

    ప్రధాని పూర్తి ప్రసంగం ఇక్కడ చూడండి..

  • 15 Aug 2022 08:36 AM (IST)

    భారత్ సాధించిన ఘనతల గురించి వివరిస్తోన్న ప్రధాని..

  • 15 Aug 2022 07:51 AM (IST)

    దేశ చరిత్రలో నేడు చారిత్రక దినోత్సవం..

    75 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశం నవ సంకల్పంతో వెళుతోంది. అమర వీరుల త్యాగాన్ని స్మరించుకోవాలి. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్‌ చేస్తున్నాను. అల్లూరి సీతరామరాజు మాతృభూమి కోసమే జీవించారు’ అని చెప్పుకొచ్చారు.

  • 15 Aug 2022 07:40 AM (IST)

    జాతీని ఉద్దేశించి మాట్లాడుతోన్న ప్రధాని నరేంద్ర మోదీ..

  • 15 Aug 2022 07:12 AM (IST)

    రాజ్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించిన మోదీ..

    మరికాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ సమాధికి నమస్కరించి, పుష్పాంజలి ఘటించారు. ప్రస్తుతం మోదీ ఎర్రకోటకు బయలుదేరారు.

  • 15 Aug 2022 06:58 AM (IST)

    జెండా ఎగురవేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి..

    కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జెండా ఎగురవేశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు మంత్రి స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

  • 15 Aug 2022 06:55 AM (IST)

    ఎర్రకోటపై మోదీ జెండా ఎగరేయడం ఇది తొమ్మిదో సారి..

    మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ఎర్రకోటను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఇది వరుసగా తొమ్మిదో సారి. ప్రధాని షెడ్యూల్‌ సాగుతుంది ఇలా.. * ఉదయం 7:06 – మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్‌లో ప్రధాని మోదీ పూలమాలలు వేస్తారు. * ఉదయం 7:14 గంటలకు రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోటకు బయలుదేరుతారు. 7:18 గంటలకు లాహోరీ గేట్‌కు వెళ్లి ఆర్‌ఎం, ఆర్‌ఆర్‌ఎం, డిఫెన్స్ వందనాలు తీసుకుంటారు. * 7:20 గంటలకు ఎర్రకోట వద్ద గౌరవ గార్డ్ నిర్వహిస్తారు. * 7:30 గంటలకు ప్రధాన మంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.

Published On - Aug 15,2022 6:50 AM

Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే