COVID-19 vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. కేవలం 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ..
India Coronavirus Vaccination: దేశంలో ఓవైపు కరోనా మహమ్మరి విజృంభిస్తోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో
India Coronavirus Vaccination: దేశంలో ఓవైపు కరోనా మహమ్మరి విజృంభిస్తోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో రికార్డును సాధించింది. ప్రపంచంలోనే వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి భారత్ ఈ ఘనతను సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం రాత్రి రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 14,08,02,794 మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 92.89లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి డోసు, 59.94లక్షల మందికి రెండో డోసు అందించినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు 1.19 కోట్ల మొదటి డోసు, 62.77లక్షల మందికి రెండో డోసు అందించినట్లు వెల్లడించింది. 45-60 వయస్సు వారు 4.76 కోట్ల మందికి మొదటి డోసు ఇవ్వగా, 23.22 మందికి రెండో డోసు అందించినట్లు వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 4.96 కోట్ల మందికి మొదటి డోసు ఇవ్వగా.. 77.02లక్షల మందికి రెండో డోసు పంపిణీ చేసినట్లు వివరించింది.
కాగా.. భారతదేశంలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి 16న మెగా టీకా డ్రైవ్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ అందించగా.. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఏప్పిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ టీకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో అత్యవసర వినియోగం కింద కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డీసీజీఐ… స్పుత్నిక్ వీ, జైడస్ క్యాడిలా ‘విరాఫిన్’ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.
Also Read: