Independence Day: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సంబరాలకు గాంధీ దూరంగా ఎందుకున్నారు? ఆసక్తికర విషయాలు!

Independence Day: భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి వివరాల ప్రకారం పరిశీలిస్తే.. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న..

Independence Day: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సంబరాలకు గాంధీ దూరంగా ఎందుకున్నారు? ఆసక్తికర విషయాలు!
Independence Day
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 7:15 PM

Independence Day: భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి వివరాల ప్రకారం పరిశీలిస్తే.. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. ఎందుకంటే ఆయన మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు.

మహాత్మగాంధీకి లేఖ..

అయితే ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌లు మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని లేఖలో గాంధీజీని కోరారు.

ఆ లేఖకు గాంధీజీ సమాధానం..

భారత స్వాతంత్ర్యం గురించి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌లు రాసిన లేఖపై గాంధీజీ సమాధానం ఇచ్చారు. కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అంటూ సమాధానం ఇచ్చారు గాంధీ. జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగించారు.

ఎర్రకోటపై జాతీయ జెండా ఎప్పుడు ఎగిరింది:

అయితే ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం.. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు. భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ వివరాల ప్రకారం.. మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి.. 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటన:

అయితే స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం అంటూ ఏదీ కూడా లేదు. జన గణ మణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందినట్లు అప్పటి చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

Independence Day: భారతదేశం కంటే ఒక్కరోజు ముందే పాకిస్తాన్‏లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఎందుకో తెలుసా ?

మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత ‘స్వర్ణ’ పురస్కారం..? ప్రతినిధుల సభలో ఎంపీ తీర్మానం