22 February 2025

తెలుగులో ఒక్క సినిమా చేయలేదు.. అప్పుడే డేటింగ్ రూమర్స్‏తో రచ్చ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కానీ అంతలోనే డేటింగ్ రూమర్స్‏తో ఫేమస్ అయ్యారు ఆ ఇద్దరు హీరోయిన్స్. 

 తాజాగా ఈ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విడాకులకు ఆమె కారణమంటున్నారు

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కన్నడ బ్యూటీ దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్‏గా వెండితెరకు పరిచమయైంది.

ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీతోనే నటిగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అంతలోనే డేటింగ్ రూమర్లతో నెట్టింట తెగ ఫేమస్ అయ్యింది. 

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సైంధవి విడాకులకు ఆమె కారణమంటూ నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి సినిమా చేశారు. 

బ్యాచిలర్ సినిమాలో వీరిద్దరు రొమాంటిక్ సీన్లతో రచ్చ చేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి. 

దివ్యభారతి మాత్రమే కాకుండా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే సైతం రామ్ పోతినేనితో ప్రేమలో ఉందంటూ ప్రచారం నడుస్తుంది.