హీరోగా సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్.. ఏంటా సినిమా.? 

22 February 2025

Prudvi Battula 

సినీ పరిశ్రమలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా లాంటివారు ఉన్నారు.

వీరి బాటలోనే మరో  చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరోగా నటించడానికి సిద్దమయ్యాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు.

జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి జంటగా నటించిన ప్రియరాగాలులో సౌందర్య కొడుకుగా ఆకట్టుకున్నాడు. తర్వాత అనేక సినిమాల్లో నటించాడు. ఆ చిన్నోడి పేరు ఆనంద్ హర్షవర్దన్.

ఆనంద్ హర్షవర్షన్.. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ వెంకటేశ్, మీనా కలిసి నటించిన సూర్యవంశంలో వెంకీ తనయుడిగా నటించి తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు.

ఈ కుర్రాడు ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పీబీ శ్రీనివాస్ మనవడు. జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంలో వాల్మికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు.

అలాగే వెంకీ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో కనిపించాడు. తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు.

దాదాపు 25 సినిమాల్లో నటించిన ఆనంద్.. ప్రస్తుతం హీరోగా బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు.

నిదురించు జహాపన సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. సోషల్ మీడియాలో తాజాగా ఆనంద్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.