ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పట్టణం జోషిమఠ్‌లో ఊళ్లకు ఊళ్లే కుంగిపోతున్నాయి. జోషిమఠ్‌లో శుక్రవారం సాయంత్రం ఒక ఆలయం కూలిపోయింది. సుమారు 600 ఇళ్లు, ఇతర నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడటంతో నివాసితులంతా భయంతో ఇళ్లను విడిచిపెట్టి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని పరిస్థితిని సమీక్షించారు. భారీ స్థాయిలో భూమి కంపించే అవకాశం ఉన్నందున బాధిత కుటుంబాలను ఖాళీ చేసి తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ సర్వే కోసం నిపుణులు శాస్త్రవేత్తల బృందం హిమాలయ పట్టణంలో మోహరించారు. భారీ స్థాయిలో భూమి కంపించటంతో పట్టణం మొత్తం నాశనమైపోతుందనే భయం నెలకొంది. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశించారు . ప్రాణాలను రక్షించడంమే తమ మొదటి ప్రాధాన్యతగా చెప్పారు. అలాగే జోషిమఠ్ సమస్యకు తాత్కాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఘర్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి రంజిత్ కుమార్ సిన్హాలు నిపుణుల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ధామి తెలిపారు. ప్రస్తుతానికి తక్షణమే తరలించాల్సిన అవసరం ఉంది. అవసరమైన పరికరాలతో వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రమాదకర ప్రాంతాల్లో చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవని అన్నారు.
#WATCH | Uttarakhand: Due to a landslide in the Marwari area of Joshimath, a temple got damaged and fell on top of a residential building. The building was damaged. pic.twitter.com/MwIo34dyav
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 6, 2023
బద్రీనాథ్ ముఖద్వారంగా ప్రసిద్ధి చెందిన జోషిమఠ్ దాదాపు 20 వేల మంది నివాసితులు ఉన్నారని చెబుతారు. ఈ పట్టణం ఇప్పుడు భారీ కొండచరియలు విరిగిపడే ముప్పును ఎదుర్కొంటోంది. జోషిమఠ్‌లోని సింఘ్‌ధార్ వార్డులో శుక్రవారం సాయంత్రం ఓ ఆలయం కూలిపోయింది. ఘటన జరిగినప్పుడు ఆలయంలో ఎవరూ లేరని చెబుతున్నారు. దీంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 2021లో, జోషిమఠ్ సమీపంలోని తపోవనా, విష్ణుగఢ్‌లోని ఒక ఆనకట్ట సమీపంలో సంభవించిన మేఘ విస్ఫోటనంలో వందలాది మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ హిమాలయ పర్వత ప్రాంతంలో మేఘాల విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం మరియు భూకంపాలు వంటి విపత్తులు తరచుగా ఏర్పాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విష్ణుప్రయాగలోని జలవిద్యుత్ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన 60 కుటుంబాలను తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..