ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం..
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 32మందికి గాయాలయ్యాయి.
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 32మందికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు జోథ్‌పూర్ నుంచి ఒసియన్‌కు వెళ్తోంది. మథానియా రోడ్డుపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. అప్రమత్తమైన స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
బస్సు.. ట్రక్కును బలంగా ఢీకొట్టటడంతో రెండు వాహనాల క్యాబిన్లలో కూర్చున్న వారు లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం తర్వాత భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన షెడ్యూల్ మార్చుకుని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మృతులు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
जोधपुर के एमडीएम अस्पताल पहुंचकर मथानिया क्षेत्र में हुई सड़क दुर्घटना में घायल हुए लोगों की कुशलक्षेम जानी एवं प्रशासन को बेहतर इलाज के लिए निर्देशित किया। इस हादसे में जान गंवाने वाले सभी दिवंगतों की आत्मा की शान्ति एवं घायलों के जल्द स्वास्थ्य लाभ की कामना करता हूं। pic.twitter.com/n8L2TqjujO
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2023
మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన మరో 32 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..