Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆలయంలో మహిళపై దాడి.. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి మరీ.. అసలేం జరిగిందంటే?

ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆలయ సిబ్బంది. టెంపుల్‌ నుంచి బయటకు ఈడ్చిపడేశారు. జట్టుపట్టుకొని కొట్టుకుంటూ బయటకు గెంటేశారు.

Viral: ఆలయంలో మహిళపై దాడి.. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి మరీ.. అసలేం జరిగిందంటే?
Temple Attack On Woman
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2023 | 9:19 AM

ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆలయ సిబ్బంది. టెంపుల్‌ నుంచి బయటకు ఈడ్చిపడేశారు. జట్టుపట్టుకొని కొట్టుకుంటూ బయటకు గెంటేశారు. అంతటితో ఆగలేదు సిబ్బంది. ఆమె వారినిప్రతిఘటించడంతో ఐరాన్‌ రాడ్‌తో కూడా కొట్టేందుకు ప్రయత్నించారు.

బెంగళూరులో డిసెంబర్‌ 21న చేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాను వెంకటేశ్వరస్వామి భార్యనని చెప్పుకుంటూ స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది ఆ మహిళ. ఐతే అందుకు అనుమతించకపోవడంతో పూజారిపై ఉమ్మి వేసింది. దీంతో ఆగ్రహంతో ఆమెను జుట్టుపట్టుకొని బయటకు గెంటేశారు సిబ్బంది. ఐతే ఆ మహిళ మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు స్థానికులు. అమృతహళ్లి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో ఆలయ సిబ్బంది నిర్వాకం బయటికొచ్చింది.. మహిళపై దాడి దృశ్యాలు టెంపుల్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా ఆలయ సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.