COVID-19 Norms: రెచ్చిపోయిన బీజేపీ నేత.. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో పుట్టిన రోజు వేడుకలు..
COVID-19 Norms: అసలే కరోనా వైరస్ వ్యాప్తితో యావత్ దేశం అతలాకుతలం అవుతుంటే.. కొందరు రాజకీయ నేతలు మాత్రం కనీస బాధ్యత లేకుండా...
COVID-19 Norms: అసలే కరోనా వైరస్ వ్యాప్తితో యావత్ దేశం అతలాకుతలం అవుతుంటే.. కొందరు రాజకీయ నేతలు మాత్రం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రా లాక్‌డౌన్, కర్ఫ్యూ, కరోనా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఓ బీజేపీ నాయకురాలు ఏకంగా వ్యాక్సినేషన్ కేంద్రంలోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో వెలుగు చూసింద. బీజేపీ వార్డు ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఆకాష్ విజయ వర్గీయ మద్దతుదారు అయిన మాధురీ జైస్వాల్.. తన జన్మదిన వేడుకలను ఇండోర్‌లోని టీకా కేంద్రంలో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా కనీసం మాస్క్ ధరించకపోగా.. భౌతిక దూరం కూడా పాటించకుండా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. కాగా, ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారి అదికాస్తా ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికారు కంట పడింది. దాంతో మాధురీ జైస్వాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, వార్డ్ నెంబర్ మాధురీ జైస్వాల్ కు అసెంబ్లీ నెంబర్ 3 పరిధిలోని టీకా కేంద్రంలో ప్రజలకు టీకా వేయించే బాధ్యతను బీజేపీ అప్పగించింది. అయితే, శనివారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో బీజేపీ కార్యకర్తలు, ఇతరులు కేక్ తీసుకువచ్చి ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
ఈ వ్యవహారం కాస్తా వివాదంగా మారడంతో మాధురి స్పందించారు. ‘‘మా అత్తయ్య ప్రమాదానికి గురికావడం వల్ల కుటుంబం మొత్తం బాధలో ఉంది. ఆ కారణంగానే నేను నా పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో జరుకోలేదు. టీకా కేంద్రంలో ప్రజలకు టీకా వేయించేందుకు గానూ 39వ వ్యా్క్సినేషన్ సెంటర్‌కు వచ్చాను. అయితే, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, కొంతమంది కార్మికులు నాకు తెలియకుండా కేక్ తీసుకువచ్చారు. అలా నా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై నాకు అవగాహన లేదు. ఈ వ్యవహారంపై నేను క్షమాపణలు చెబుతున్నాను.’ అని మాధురి జైస్వాల్ తెలిపారు.
మరోవైపు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్ అయి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ జాడియా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నివేదికను జిల్లా కలెక్టర్ మనీష్ సింగ్‌కు అందజేశారు.
Birthday Celebrations:
BJP कार्यकर्ताओं ने सत्ता के मद में सारी शर्मोहया बेच डाली!आज इंदौर के एक वैक्सिनेशन केंद्र में महिला नेत्री ने जन्मदिन मनाया,समर्थक बिना मास्क के!मूकबधिर,अंधत्व का शिकार बुज़दिल प्रशासन,क्या जेल,धारा 188 आमजन के ही लिए है, आका ने जो कहा है वैक्सिनेशन को महोत्सव के रूप में मनाएं? pic.twitter.com/oGxEOKdKDG
— KK Mishra (@KKMishraINC) June 5, 2021
Also read: