AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని.. చిన్నారి మృతి..

పిల్లలు మహా గడుగ్గాయిలు. వారు చేసే అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తుంటారు. ఇక స్కూల్ కు వెళ్లే బుడతల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. పెన్సిల్, ఎరేజర్, షార్ప్ నర్, బుక్స్ ఇవే వారి ఆటవస్తువులుగా మార్చుకుంటారు. కొన్ని సార్లు...

విషాదం.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని.. చిన్నారి మృతి..
Death
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Dec 23, 2022 | 7:29 AM

Share

పిల్లలు మహా గడుగ్గాయిలు. వారు చేసే అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తుంటారు. ఇక స్కూల్ కు వెళ్లే బుడతల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. పెన్సిల్, ఎరేజర్, షార్ప్ నర్, బుక్స్ ఇవే వారి ఆటవస్తువులుగా మార్చుకుంటారు. కొన్ని సార్లు వాటి ద్వారానే ప్రమాదాలకు గురువుతున్నారు. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఉత్తర ప్రదేశ్ లోని హమీర్‌పూర్‌ కొత్వాలి పహాడీ వీర్ గ్రామంలో నందకిషోర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు అభిషేక్ (12), కుమార్తెలు అన్షిక (8), అర్తిక (6) ఉన్నారు. బుధవారం స్కూల్ కు వెళ్లి వచ్చిన తర్వాత.. వారందరూ సాయంత్రం సమయంలో టెర్రస్‌పై కూర్చుని చదువుకుంటున్నారు.

హోమ్‌వర్క్ చేయడానికి కూతురు అర్తిక పెన్సిల్‌ షార్ప్‌నర్‌ను నోట్లో పెట్టుకొని పెన్సిల్‌ను చెక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెన్సిల్‌ను చెక్కగా వచ్చిన పొట్టు గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. అది గొంతుకు అడ్డుగా పడడంతో ఊపిరాడక విలవిల్లాడిపోయింది. బాధతో నేలపై పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన బంధువులు.. చిన్నారిని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

పిల్లలపై ఎప్పుడు దృష్టి పెట్టాలని, దీంతో ప్రమాదాలను నివారించవచ్చని వైద్యాధికారి సత్యేంద్రకుమార్‌ అన్నారు. కొందరు పిల్లలు పడుకొని ఆహారం, నీళ్లు తాగుతారని, ఈ చర్యలు ప్రాణానికి ప్రమాదమన్నారు. ఆహారం శ్వాసనాళంలో చిక్కుకుపోతే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పెన్సిల్‌ను సైతం జాగ్రత్తగా ఉపయోగించాలని, పిల్లల కంటికి సైతం హాని కలిగిస్తాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం