Youtube Channels Ban: 104 యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝుళిపించిన కేంద్రం.. కారణమిదే..
యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 104 ఛానెళ్లపై వేటు వేసింది. అవును, దేశవ్యాప్తంగా మరో 104 యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటేసింది కేంద్రం.

యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 104 ఛానెళ్లపై వేటు వేసింది. అవును, దేశవ్యాప్తంగా మరో 104 యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటేసింది కేంద్రం. జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా తప్పుడు కథనాలు ఇస్తున్నారంటూ వీటిని బ్లాక్ చేసింది. యూట్యూబ్ ఛానెల్స్‌తోపాటు 45 వీడియోలు, 4 ఫేస్‌బుక్ అకౌంట్స్, 3 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, 5 ట్విట్టర్ ఖాతాలు, 6 వెబ్‌సైట్స్‌పైనా నిషేధం విధించినట్లు ప్రకటించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. ఇవన్నీ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69ఏ కింద చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 2021 నుంచి ఇప్పటివరకు 16వందల 43 యూఆర్‌ఎల్స్, వెబ్ పేజెస్‌ను బ్లాక్ చేయాలంటూ నోటీసులు ఇచ్చినట్టు రాజ్యసభలో సమాధానమిచ్చారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఇచ్చినా, పోస్టులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..