AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaleshwaram Project: పట్టువీడని ‘మహా’ రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నాకు దిగిన కాళేశ్వరం బాధితులు..

కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు పట్టువీడడం లేదు. మేడిగడ్డ బ్యాక్‌ వాటర్‌తో ముంపుకు గురవుతున్న భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిరసనలు చేపట్టిన రైతులు తమ గోడు పట్టించుకోవాలని

Kaleshwaram Project: పట్టువీడని ‘మహా’ రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నాకు దిగిన కాళేశ్వరం బాధితులు..
Kaleshwaram Project
Shiva Prajapati
|

Updated on: Dec 23, 2022 | 5:45 AM

Share

కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు పట్టువీడడం లేదు. మేడిగడ్డ బ్యాక్‌ వాటర్‌తో ముంపుకు గురవుతున్న భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిరసనలు చేపట్టిన రైతులు తమ గోడు పట్టించుకోవాలని మహారాష్ట్ర సర్కార్‌ను కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌ బ్యాక్‌ వాటర్‌తో తమ భూములు ముంపునకు గురవుతున్నాయని..పరిహారం ఇవ్వాలంటూ కొందరు రైతులు నిరసనలు చేపట్టారు. 36 రోజులుగా సిరొంచలో నిరసన దీక్షలు కొనసాగిస్తారు. నాగ్‌పూర్‌ అసెంబ్లీలో శీతాకాల సమావేశాల నేపథ్యంలో.. అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, దీంతో రోజుకు నలుగురు రైతుల చొప్పున దీక్ష చేపట్టారు. వరుసగా రైతులు దీక్షకు కూర్చొవడంతో స్పందించిన అహేరి ఎమ్మెల్యే ధర్మరావు బాబు.. ప్రభుత్వంతో మాట్లాతానని హామీ ఇచ్చారు.

ఆతర్వాత డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవీస్‌తో రైతులను సమావేశపరిచారు. సిరొంచ తాలూకా రైతులు సమస్యలు విన్న ఫడ్నవీస్‌…సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నోటిఫై అయిన 130 హెక్టార్ల భూమికి పరిహారం వెంటనే ఇప్పించడంతో పాటు అదనంగా ముంపునకు గురువుతున్న భూముల గురించి ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సిరొంచలో మేడిగడ్డ బాధిత గ్రామాల రైతులతో సమావేశం అయి జరిగిన విషయాన్ని వివరిస్తామని రైతులు తెలిపారు. తమ సమస్యల పట్ల మహారాష్ట్ర సర్కార్‌ సానుకూలంగా స్పందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!
క్రెడిట్‌ కార్డ్‌ ఇలా వాడితే CIBIL స్కోర్‌ పెరుగుతుందా?
క్రెడిట్‌ కార్డ్‌ ఇలా వాడితే CIBIL స్కోర్‌ పెరుగుతుందా?
నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న కమెడియన్..
నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న కమెడియన్..
ప్రతి రోజూ చికెన్ తింటుఈ 4 సమస్యలతో మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే
ప్రతి రోజూ చికెన్ తింటుఈ 4 సమస్యలతో మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే
అదృష్టమే, ఆనందమే.. పుష్కర యోగంతో ఈ రాశుల ఇంట సిరుల పంట!
అదృష్టమే, ఆనందమే.. పుష్కర యోగంతో ఈ రాశుల ఇంట సిరుల పంట!
ఈ ఐదుగురికి ఇదే చివరి సీజన్.. ఇకపై ఐపీఎల్‌లో ఆడడం కష్టమే..?
ఈ ఐదుగురికి ఇదే చివరి సీజన్.. ఇకపై ఐపీఎల్‌లో ఆడడం కష్టమే..?