AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horrifying Video: మరీ ఇంత దారుణమా.. అసలు ఆమె మనిషా?.. రాక్షసినా?.. షాకింగ్ వీడియో వైరల్..

Horrifying Video: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు మరింత నశిస్తోంది. చిన్న పిల్లలు అనే కనీస కనికరం..

Horrifying Video: మరీ ఇంత దారుణమా.. అసలు ఆమె మనిషా?.. రాక్షసినా?.. షాకింగ్ వీడియో వైరల్..
Woman Beating
Shiva Prajapati
|

Updated on: Mar 16, 2021 | 12:14 PM

Share

Horrifying Video: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు మరింత నశిస్తోంది. చిన్న పిల్లలు అనే కనీస కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులపై తమ రాక్షసత్వాన్నంతా ప్రదర్శిస్తున్నారు. దీనికి నిదర్శనమైన ఘటన ఒకటి తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే మూడేళ్ల చిన్నారికి నరకం చూపించింది. ఆ టార్చర్ బరించలేక పారిపోతున్న చిన్నారిని వెంటబడి మరీ దొరకబుచ్చుకుని చావబాదింది. చేతితో పైకి లేపి నేలకేసి కొట్టింది. గొంతుపై కాలు పెట్టి తొక్కింది. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా సరే కనీస కనికరం చూపకుండా విచక్షణారహితంగా కొట్టింది. సదరు మహిళ తన కూతురుని కొడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడు. అయితే, చిన్నారిని అంతలా కొడుతున్నా పక్కన ఉన్న వారు ఒక్కరు కూడా స్పందించకపోవడం మరీ దారుణం. చివరికి ఓ వ్యక్తి వచ్చి మహిళను అడ్డుకున్నాడు. ఆమెను నాలుగు వాయించి.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

కాగా, ఈ ఘటన తాలూకు వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో మూడేళ్ల చిన్నారిని కొట్టిన మహిళ ప్రస్తుతం పోలీసు స్టేషన్‌లో ఉందన్నారు. అయితే, కళ్ల ముందు అంత ఘోరం జరుగుతున్నా పక్కనే ఉన్నవారు తమాషా చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ ఆ దారుణాన్ని అడ్డుకోకపోవడం తనను మరింత ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. కాగా, ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారిని చావబాదిన మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు. తీవ్రపదజాలంతో కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారిని చిత్రహింసలు పెట్టిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఈ వీడియోను చూస్తుంటే మనిషన్న ప్రతీ ఒక్కరి హృదయం మండిపోవడం ఖాయం.

IAS Officer Shared Video:

Also Read:

Sita-Rama kalyanam: భద్రాద్రి రాములోరి కల్యాణం కోసం ప్రకాశం జిల్లా నుంచి గోటి తలంబ్రాలు

Thrissur Pooram : త్రిస్సూర్ పూరం ఉత్సవాలకు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వం.. కండిషన్స్ అప్లై