కోవిద్ కేసులు ఇంకా తగ్గిన పక్షంలో అన్ -లాక్ కి త్వరలో అవకాశం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వెల్లడి
అన్-లాక్ దిశగా యోచిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నగరంలో కోవిడ్ కేసులు ఇంకా తగ్గాలని, ఎందుకైనా మంచిదని లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామని చెబుతూనే ఆయన..
అన్-లాక్ దిశగా యోచిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నగరంలో కోవిడ్ కేసులు ఇంకా తగ్గాలని, ఎందుకైనా మంచిదని లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామని చెబుతూనే ఆయన.. అన్నీ అనుకూలిస్తే 31 నుంచే లాక్ డౌన్ ఎత్తివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఇది దశలవారీగా ఉంటుందని ఆయన చెప్పారు. పాజిటివిటీ రేటు గత ఏప్రిల్ లో 30 శాతం ఉండగా నేడది 2.5 శాతానికి తగ్గిందన్నారు. గత 24 గంటల్లో 1600 కేసులు నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, వీటిని ఇలాగే కొనసాగించేలా చూడాల్సి ఉందన్నారు. నిజానికి లాక్ డౌన్ ని పొడిగించాలన్న యోచన లేకున్నా తప్పలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించేందుకు తాను వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడానని ఆయన తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలో థర్డ్ కోవిద్ వేవ్ ప్రమాదం ఉండదని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ కోసం తమ ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. నగరంలో కోవిద్ కేసులు ఇంకా తగ్గుతాయన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ లాక్ డౌన్ లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని, ఇది ముదావహమని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో ఇప్పుడు ఆక్సిజన్ కొరత అసలు లేదని అన్నారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్ అందుతుందని ఆశిస్తున్నామని, విదేశాల నుంచి 24 గంటల్లోగా వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని తాను మళ్ళీ కోరుతున్నానని ఆయన చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.