భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్.. 8,594 క్లర్క్, పీఓ, ఆఫీసర్స్ స్కేల్ II, III స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్-2023 విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో ఈ నియామకాలను చేపట్టనుంది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులను గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల కింద వర్గీకరించారు.
ఆయా పోస్టుకలు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి దరఖాస్తు విధానం ప్రారంభమైంది.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.175లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 125 మార్కులకు 2 గంటల సమయంలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెయిన్ పరీక్ష 60 ప్రశ్నలకు 60 మార్కులకు 45 నిముషాల్లో పరీక్ష జరుగుతుంది. మెయిన పరీక్షలో షార్ట్‌లిస్టింగ్ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.