AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ మొదటికి ..? ప్రధాని మోదీ సమావేశానికి గైర్ హాజరు కాలేదన్న బెంగాల్ మాజీ సీఎస్ బందోపాధ్యాయ లేఖ

యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి తాను గైర్ హాజరు కాలేదని బెంగాల్ మాజీ సీస్, ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉన్న ఆలపన్ బందోపాధ్యాయ స్పష్టం చేశారు..

మళ్ళీ మొదటికి ..? ప్రధాని మోదీ సమావేశానికి గైర్ హాజరు కాలేదన్న బెంగాల్ మాజీ సీఎస్ బందోపాధ్యాయ లేఖ
Modi
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 04, 2021 | 12:13 AM

Share

యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి తాను గైర్ హాజరు కాలేదని బెంగాల్ మాజీ సీస్, ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉన్న ఆలపన్ బందోపాధ్యాయ స్పష్టం చేశారు.. ఈమేరకు ఆయన కేంద్రానికి లేఖ రాస్తూ.. సీఎం అక్కడ ఉండేంతవరకు తాను కూడా ఉన్నానని, పేర్కొన్నారు. యాస్ సైక్లోన్ కారణంగా దీఘా టౌన్ లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలపై నేను ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళాను అని ఆయన తెలిపారు. గత శుక్రవారం మోదీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కి మమతా బెనర్జీ గైర్ హాజరు కావడం పెను దుమారానికి దారి తీసింది. అలాగే బందోపాధ్యాయ వ్యవహారం కూడా కేంద్రానికి ఆగ్రహం కలిగించింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేసినప్పటికీ దీదీ ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా రాష్ట్రంలో ఈ కోవిద్ తరుణంలో ఆయన సేవలు ఎంతో అత్యవసరమంటూ ఆయనను కేంద్రానికి పంపేందుకు నిరాకరించారు. ఆయనకు కేంద్రం పంపిన షోకాజ్ నోటీసు పంపినా అది నిష్ప్రయోజనమే అయింది. ఈ నోటీసుకు మూడు రోజుల్లోగా సమాధానం పంపాలని అందులో ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన చేత మమత ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయించి తన ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.

అయితే రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం ఆమె చర్యను విమర్శించింది..ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి ఉందని ఈ సంఘం పేర్కొంది. కానీ ముఖ్యమంత్రి ఈ వాదనను తోసిపుచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ లో రెస్టారెంట్లపై పాక్షికంగా ఆంక్షల సడలింపు…..అయిష్టంగానే అంగీకరించిన మమతా బెనర్జీ..

గబ్బిలాల్లో 5 వేల రకాల కరోనా వైరస్ లున్నాయా..2015లోనే అమెరికా చైనాలు కలిసి రహస్యంగా కరోనా వంటి వైరస్ ను సృష్టించాయా..!

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా