బెంగాల్ లో రెస్టారెంట్లపై పాక్షికంగా ఆంక్షల సడలింపు…..అయిష్టంగానే అంగీకరించిన మమతా బెనర్జీ..

బెంగాల్ లో రెస్టారెంట్లను సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు తెరిచి ఉంచేందుకు సీఎం మమతా బెనర్జీ గురువారం అంగీకరించారు..

బెంగాల్ లో రెస్టారెంట్లపై పాక్షికంగా ఆంక్షల సడలింపు.....అయిష్టంగానే అంగీకరించిన మమతా బెనర్జీ..
Restrictions On Restaurants
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 04, 2021 | 12:05 AM

బెంగాల్ లో రెస్టారెంట్లను సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు తెరిచి ఉంచేందుకు సీఎం మమతా బెనర్జీ గురువారం అంగీకరించారు, కోవిద్ లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అయిష్టానంగానే ఆమె ఇందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు. రెస్టారెంట్ స్టాఫ్ అంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, కోవిద్ ప్రోటోకాల్ ని అనుసరించాలని ఆమె కోరారు. హోటల్, రెస్టారెంట్ల మనుగడ కోసం కొన్ని గంటలపాటు బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. వీటిని మూసివేయాలని తాము కోరడంలేదని,కానీ కోవిద్ మహమ్మారిని మనం అదుపులో సి ఉంచాల్సి ఉందని అన్నారు. ఈ పాండమిక్ లో బిజినెస్ కార్యకలాపాలను కొనసాగించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఏమైనా కోవిద్ ని మనం కనీసం అదుపులో ఉంచాలి.. మరో వేవ్ రాకుండా చూడాలి అని మమతా బెనర్జీ అన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు గతవారం బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కోవిద్ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల లాకి డౌన్ పొడిగిస్తున్నామని పేర్కొంది. వరుసగా రోజువారీ కేసులు సుమారు 15 వేల వరకు ఉంటున్నాయి. కాగా ఇవి తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం చాలావరకు ఆంక్షలను సడలించింది. కోల్ కతా లో ఇంకా ఇవి అధికంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Immunity Booster Food: ఈ ఐదింటిని రోజూ తీసుకోండి.. ఇమ్యూనిటీని పెంచుకోండి..

One Crore Vaccines: రోజుకు కోటి టీకాలు..జూలై నుంచి ఆర్ధికాభివృద్ధి రెండూ సాధ్యమే..సీఈసీ కెవి సుబ్రహ్మణ్యం