India Corona: మళ్లీ డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా.. ఒక్కరోజే 11వేలకు పైనే కొత్త కేసులు.. మరణాలు ఎన్నంటే..
ఇదీ.. వార్నింగ్ బెల్, డేంజర్ బెల్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.. ఎందుకంటే ఇవాళ్టి కరోనా కేసులు చూస్తుంటే అలాగే ఉంది మరీ పరిస్థితి. వామ్మో ఒక్కరోజులో ఇన్ని కేసులా? అనేలా ఉన్నాయి మళ్లీ కరోనా కేసులు. తాజాగా నమోదైన కరోనా..
ఇదీ.. వార్నింగ్ బెల్, డేంజర్ బెల్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.. ఎందుకంటే ఇవాళ్టి కరోనా కేసులు చూస్తుంటే అలాగే ఉంది మరీ పరిస్థితి. వామ్మో ఒక్కరోజులో ఇన్ని కేసులా? అనేలా ఉన్నాయి మళ్లీ కరోనా కేసులు. తాజాగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే గడిచిన 24 గంటల్లో 11 వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 29 మరణాలు సంభవించాయి. అయితే తాజాగా కరోనా కేసులే కాదు.. కరోనా మరణాలు పెరిగాయి. ఇక కరోనా యాక్టివ్ కేసులు 50వేల మార్క్‌కు చేరువయ్యాయి.
అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటే పొరపాటే మెల్లమెల్లగా చాపకింద నీరులా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు సైలంట్‌గా ఉన్న కేసులు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. దేశంలో ఒకే రోజు 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయంటే కేసుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అటు 50 వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఉంది. ఇక 24 గంటల్లో కరోనాతో 29 మంది మృతి చెందారు. రోజూవారి పాజిటివిటీ రేటు పెరగడం కాస్త ఊరట లభించింది.
ఇక తెలుగురాష్ట్రాలోనూ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రోజువారీ కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఇక ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా. ఏలూరు జిల్లాలో కొత్తగా 12 కేసులు నమోదవ్వడం కాస్త ఆందోళణ కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 30 కరోనా కేసులు నమోదు అవ్వడంతో జిల్లాలో కలవరం మొదలైంది. ఇటు తెలంగాణలోనూ మెల్లగా విజృంభిస్తోంది కరోనా.
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు హెచ్చరించారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి