AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విపక్షాల విమర్శలు, ఆందోళనల వెనుక విదేశీ శక్తుల కుట్ర..! బీజేపీ సరికొత్త ఆరోపణాస్త్రం

గత కొన్నేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తే.. సరిగ్గా సమావేశాలకు కొద్ది రోజుల ముందు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులను లక్ష్యంగా చేసుకుని కథనాలు విడుదలవుతున్నాయి. వాటినే అస్త్రాలుగా మలచుకుంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాయి.

విపక్షాల విమర్శలు, ఆందోళనల వెనుక విదేశీ శక్తుల కుట్ర..! బీజేపీ సరికొత్త ఆరోపణాస్త్రం
Rahul Gandhi, George Soros And Occrp
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 06, 2024 | 1:27 PM

Share

పార్లమెంట్ సమావేశాలు వచ్చాయంటే విపక్షాలు వివిధ ప్రజా సమస్యలను ఆయుధాలుగా మలచుకుని అధికారపక్షంపై విరుచుకుపడుతుంటాయి. నిర్మాణాత్మక విమర్శలతో ప్రతిపక్షాలు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాయి. కానీ ఇది గతం. ఇప్పుడంతా రాజకీయమే. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, అర్థసత్యాలు, అసత్యాలతో విరుచుకుపడడమే నిత్యకృత్యంగా మారిపోయింది. మరింత దిగజారి కించపరిచే వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననాలకు సైతం తెగబడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏమీ లేదు.. దాదాపు అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి అన్నట్టుగా తయారయ్యాయి నేటి రాజకీయాలు. వీటికి భిన్నంగా ఆశించడమే మూర్ఖత్వం అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత దిగజారినా సరే.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రజలు రోజూ ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వస్తుందేమో, వాటికి ప్రభుత్వం పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తుందేమోనన్న ఆశ సామాన్యుల్లో ఉంటుంది. కానీ అందుకు పూర్తి భిన్నంగా భారతదేశ ఎదుగుదలను ఓర్వలేని విదేశీ దుష్టశక్తులు తలపెట్టిన కుట్రల్లో భారత ప్రతిపక్షాలు భాగమవుతున్నాయి. “దేశం ఏమైపోతే మాకేంటి.. ప్రజాసమస్యలతో మాకు పనేంటి.. మాకు రాజకీయాలే ముఖ్యం” అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను గమనిస్తే.. సరిగ్గా సమావేశాలకు కొద్ది రోజుల ముందు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులను లక్ష్యంగా చేసుకుని కథనాలు విడుదలవుతున్నాయి. వాటినే అస్త్రాలుగా మలచుకుంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఎలాంటి చర్చలు లేకుండానే శీతాకాల సమావేశాల్లో తొలి వారం రోజులు వృధా అయ్యాయి. రెండో వారం పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షం ఎత్తుకున్న అంశాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దీంతో అధికారపక్షం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ సంస్థతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధం ఉందంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. “ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)”తో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (BJP) నేతలు సంబిత్ పాత్ర, డా. కే. లక్ష్మణ్ విమర్శించారు.

ఇంతకీ OCCRP అంటే ఏంటి?

“ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)” ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులతో ఏర్పాటైన నెట్‌వర్క్. ఇద్దరు సీనియర్ పాత్రికేయులు డ్రూ సులివాన్, పాల్ రాడు ఈ సంస్థను ఏర్పాటు చేయగా, అమెరికా ప్రభుత్వంతో పాటు వివిధ అంతర్జాతీయ ఎన్జీవోలు నిధులు సమకూర్చుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఉన్న 50కి పైగా స్వతంత్ర సంస్థలు, ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. స్వీడిష్ టెలీకాం బ్రైబరీ, పనామా పేపర్స్ వంటి ఆర్థిక నేరాలు, వివిధ దేశాధ్యక్షుల వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాలపై అనేక రిపోర్టులను విడుదల చేసింది. 2006లో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా గురించి ఒక్క నివేదిక కూడా విడుదల చేయలేదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వంతో పాటు, అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ అందించే నిధులతో నడుస్తున్న సంస్థ చీకటి ఎజెండా గురించి ఫ్రెంచ్ పత్రిక మీడియాపార్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇందులో అమెరికా ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో పాటు వారి ఎజెండా ప్రకారం OCCRP నడుచుకుంటోందని పేర్కొంది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సహా అనేక రకాల కుట్రలకు పాల్పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శరవేగంగా వృద్ధి సాధించే దేశాలంటే ఆ దేశానికి ఏమాత్రం గిట్టదు. వాటిని దెబ్బతీసేందుకు అనేక రకాల కుట్రలకు, పన్నాగాలకు తెగబడుతుంది. ఈ క్రమంలో ఆ దేశంలోని రాజకీయ పార్టీలను కూడా పావులుగా మార్చుకుంటుంది. వారికి అన్ని రకాల వనరులు సమకూర్చి ఆ పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తద్వారా తమ చెప్పుచేతల్లో ఉండే దేశాధినేతలను తయారు చేసుకోవాలని చూస్తుంది.

బీజేపీ ఆరోపణలేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రమైన ఆరోపణలు చేసింది. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్న పరిశోధనాత్మక మీడియా సంస్థలతో రాహుల్ గాంధీ జతకట్టారని విమర్శించింది. వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా పనిగట్టుకుని వ్యతిరేక కథనాలను వండివార్చుతున్న OCCRP వంటి సంస్థలు, అమెరికన్ ఏజెన్సీలతో రాహుల్ గాంధీ ప్రమాదకర బంధాన్ని కలిగి ఉన్నారని బీజేపీ ఎంపీలు సంబిత్ పాత్ర, డా. కే. లక్ష్మణ్ పార్లమెంటులో ఆరోపించారు. అనంతరం సంబిత్ పాత్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ అత్యున్నతస్థాయి ద్రోహి అని చెప్పేందుకు నేను ఏమాత్రం వెనుకాడను” అంటూ తీవ్రంగా స్పందించారు. అమెరికన్ ఏజెన్సీలు, OCCRP వంటి సంస్థలు భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా, దేశ వృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు రూపొందిస్తాయని, వాటిని తన దుష్ప్రచారానికి రాహుల్ గాంధీ అస్త్రంగా మలచుకుంటారని సంబిత్ పాత్రా సూత్రీకరించారు.

– కోవాక్సిన్ వివాదం:

బ్రెజిల్ గురించి OCCRP ఇచ్చిన ఓ నివేదికను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారంతో రాహుల్ గాంధీ చేసిన విమర్శల కారణంగా 324 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ రద్దయిందని సంబిత్ పాత్రా ఆరోపించారు.

– పెగాసస్ ఆరోపణలు:

పెగాసస్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సైతం OCCRP నివేదికను ఆధారంగా చేసుకుని చేసినవేనని సంబిత్ పాత్రా అన్నారు. ఇదంతా భారతదేశానికి వ్యతిరేకంగా సమన్వయంతో జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

– నేషనల్ హెరాల్డ్ కేసు:

నేషనల్ హెరాల్డ్ అవకతవకలపై జరిగిన దర్యాప్తులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా జరిగిన విచారణను OCCRP ‘రాజకీయ ప్రేరేపిత’ చర్యగా పేర్కొంది. ఇది కూడా దేశ వ్యతిరేక ఎజెండాలో భాగంగానే జరిగిందని పాత్రా తెలిపారు.

ఇలాంటి ఉదాహరణలను ప్రస్తావించడంతో పాటు “రాహుల్ గాంధీకి దేశం ముందుకెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగడం కూడా ఆయనకు నచ్చదు” అని పాత్రా ఆరోపించారు. అందుకే సరిగ్గా పార్లమెంట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందే ఇలాంటి కుట్ర కథనాలు వెలువడుతున్నాయని అన్నారు. డా. కే. లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సహా దేశంలోని మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సైతం దేశ ప్రతిష్టకు మరింత భంగం కలిగించేలా ఉన్నాయి.

విపక్షంలోనూ భిన్నస్వరాలు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ గ్రూప్ అమెరికా ముడుపుల కేసును మాత్రమే పట్టుకుని ప్రజాసమస్యలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేస్తోందని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దేశం ఓ వైపు అధిక ధరలు, నిరుద్యోగం సహా సంభాల్‌లో మతఘర్షణలు, మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు, రైతుల ఆందోళన వంటి అనేక అంశాలపై చర్చించాల్సి ఉందని, కానీ కాంగ్రెస్ అదానీ అంశం తప్ప మరేదీ ప్రస్తావించడం లేదని ఆరోపిస్తున్నాయి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ