Cloudburst: క్లౌడ్‌ బరెస్ట్‌తో భారీ విధ్వంసం.. వరదల్లో కొట్టుకుపోయిన భవనాలు, వాహనాలు

Cloudburst: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో ఎంతో మంది..

Cloudburst: క్లౌడ్‌ బరెస్ట్‌తో భారీ విధ్వంసం.. వరదల్లో కొట్టుకుపోయిన భవనాలు, వాహనాలు
Cloudburst
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2022 | 5:12 PM

Cloudburst: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో ఎంతో మంది కొట్టుకుపోయారు. నివాస గృహాలు సైతం కొట్టుకుపోయాయి. ఇప్పుడు కూడా దేశంలో పలు ప్రాంతాల్లో వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో క్లౌడ్‌ బరెస్ట్‌ సంభవించింది. దీని కారణంగా వాహనాలు, భవనాలు కొట్టుకుపోయాయి. వరదల్లో రహదారులు సైతం కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భవనాలు ఈ మేఘాల విస్పోటనం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ ప్రాంతాల్లో క్లౌడ్‌ బరెస్ట్‌ అనేది సర్వసాధారణం. తరచూ వరదలతో భారీ ఎత్తున మరణాలు, నష్టాలు సంభవిస్తుంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వరదల కారణంగా భవనాలు నేలమట్టమవుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

క్లౌడ్‌ బరెస్ట్‌ అనేది అతి తక్కవ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం. ఈ క్లౌడ్‌ బరెస్ట్‌ కారణంగా కేవలం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెం.మీ (100 మి.మీ) వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తుతాయి. ఇలా అతి తక్కువ సమయంలో 10 సెం.మీ వర్షపాతం నమోదైతే క్లౌడ్‌ బరెస్ట్‌ అంటారు. సాధారణంగా ప్రతిసారి దేశంలోని హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌ ఎత్తైన ప్రాంతాల్లో పలు ఎక్కువగా క్లౌ్‌డ్‌ బరెస్ట్‌ సంభవిస్తుంటుంది. మిగితా రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైతే.. ఈ ప్రదేశాల్లో మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి క్లౌడ్‌ బరెస్ట్‌లు గత కొన్నేళ్ల కిందట సంభవించగా, ఇప్పుడు మళ్లీ సంభవిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి