AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: వీడిన తల్లీకూతుళ్ల మరణాల మిస్టరీ.. అసలు విషయం ఏంటో తేల్చేసిన పోలీసులు

కర్ణాటకలో తల్లీకూతుళ్ల మరణాల వెనుక సస్పెన్స్ వీడింది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు.

Crime: వీడిన తల్లీకూతుళ్ల మరణాల మిస్టరీ.. అసలు విషయం ఏంటో తేల్చేసిన పోలీసులు
Mother Daughter Deaths
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2022 | 5:19 PM

Share

Karnataka: కర్ణాటకలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. బనశంకరిలో  కూతురికి ఉరివేసి.. ఆపై తానూ  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దంత వైద్యురాలు శైమా. ఈ ఉదంతం వెనుక కుటుంబ కలహాలు కారణమని పోలీసులు తేల్చేశారు. ఆమెను పుట్టింటివారు రానివ్వకపోవడమే మరణాలకు కారణమని తేలింది. కొడగు జిల్లా(Kodagu District) విరాజపేట(Virajpet)కు చెందిన శైమా బీడీఎస్‌ చదువుతున్నప్పుడు, సహచరుడు నారాయణ్‌ను ప్రేమిచింది. పెద్దలు అంగీకరించపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.  ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లలేదు. దీంతో కొన్నాళ్లకు శైమా తల్లి దిగులు చెంది విరాజపేటలో ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిణామాలతో పుట్టింటివారు శైమాను తమ ఇంటివైపు కూడా చూడనివ్వలేదు. వెళ్లేందుకు ప్రయత్నించినా రానివ్వలేదు. ఎలాగొలా నెల రోజుల క్రితం అమ్మగారింటికి వెళ్లినప్పటికీ, ఆమెతో ఎవరూ సరిగా మాట్లాడలేదు. కనీసం పలకరించే వారు కూడా కరువయ్యారు.  ఈ పరిణామాలతో విరక్తి చెందిన శైమా.. కూతురికి ఉరివేసి, తానూ ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి