Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భారత్ ఏవియేషన్ హెలికాప్టర్
Helicopter Cras: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ .అక్కడ కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ బద్రీనాథ్ నుంచి జోషిమఠ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ నుంచి జోషిమఠ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న భారత్ ఏవియేషన్ కంపెనీకి చెందిన VT-HCX రిజిస్ట్రేషన్ నంబర్ గల హెలికాప్టర్ చమోలి జిల్లాలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణకులు ఉన్నట్టు సమాచరాం. భారీ వర్షం కారణంగా సిగ్నిల్ కోల్పోయి హెలికాప్టర్ కుప్పకూలినట్టు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, జోషిమఠ్ ప్రాంతంలోని హతి పహార్ వెనుక ఉన్న చాయీ గ్రామం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రమాద విషయం తెలిగానే దాని ఆచూకీ కోసం గాలించేందుకు మరో రెండు హెలికాప్టర్‌లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం కూలిన హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది.
వీడియో చూడండి..
बद्रीनाथ से लौट रहा सवारियों से हेलीकॉप्टर हुआ गायब
बद्रीनाथ धाम और जोशीमठ के बीच हेलीकॉप्टर की लोकेशन गायब होने की सूचना मिली है। चमोली डीएम गौरव कुमार ने बताया कि सवारियों से भरा हेलीकॉप्टर लापता है, रेस्क्यू ऑपरेशन शुरू कर दिया गया है। https://t.co/lczhrW0BM4
— Arjun Chaudharyy (@Arjun5chaudhary) October 30, 2026
అయితే, ఆ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, దట్టమైన మేఘాలు కారణంగా గాలింపు చర్యలు చేపట్టడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో హెలికాప్టర్ కచ్చితమైన స్థానాన్ని గుర్తించడం బృందాలకు కష్టంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
