Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ.. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం
అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించి చాలా మంది ఇప్పటికే శబరిమల చేరుకుని ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం శబమరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు.

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించి చాలా మంది ఇప్పటికే శబరిమల చేరుకుని ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం శబమరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశముంది. దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ కూడా ప్రారంభమైంది.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఇక మకరజ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని.. అప్పుడు మరింత కష్టమవుతుందని స్పాట్ బుకింగ్‌లను రద్దు చేశారు. ఈనెల 14న 40 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ఈనెల 15న మకర సంక్రాంతి రోజు కేవలం 50 వేల మందికి మాత్రమే బుకింగ్‌లు పరిమితం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి, వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సూచించింది.
మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని.. మకర జ్యోతి దర్శనానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. ఇప్పటికే మకరజ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
